Last Updated:
Hyderabad: నగరంలో మరోసారి నెత్తుటి మరకలు కనిపించాయి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి వేళ దారుణ హత్య చోటుచేసుకుంది.
బహిరంగ ప్రదేశంలో సినీ ఫక్కీలో వెంటాడి వేటాడి ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన ఘటన నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్ (బాధితుడు)పై సోమవారం రాత్రి గుర్తుతెలియని కొందరు దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. కారులో మారణాయుధాలతో వచ్చిన సాయుధులైన దుండగుల ముఠా, నయీమ్ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన నయీమ్ వారి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయితే ఆగంతకులు చేతుల్లో వేట కొడవళ్లు, పదునైన కత్తులు పట్టుకుని అతడిని వీధుల్లో వెంటాడారు.














