Last Updated:
Hyderabad: హైదరాబాద్‌లో అమ్మాయిలకు రక్షణ కరువైపోతుందనడానికి మంగళవారం రాత్రి జరిగిన ఓ సంఘటనే నిదర్శనంగా మారింది. అత్తాపూర్ ప్రాంతంలో ఓ యువతి నడిరోడ్డుపై నిల్చుండగా థార్ కారులో నలుగురు యువకులు వచ్చి ఆమెను కారులో తీసుకెళ్లారు.
Hyderabad: హైదరాబాద్‌లో అమ్మాయిలకు రక్షణ కరువైపోతుందనడానికి మంగళవారం రాత్రి జరిగిన ఓ సంఘటనే నిదర్శనంగా మారింది. అత్తాపూర్ ప్రాంతంలో ఓ యువతి నడిరోడ్డుపై నిల్చుండగా థార్ కారులో నలుగురు యువకులు వచ్చి ఆమెను కారులో తీసుకెళ్లారు. ఈ సంఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని పరిసరాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అయితే ఆమెను తీసుకెళ్లిన వ్యక్తులు కిడ్నాపర్లా లేక తెలిసిన వ్యక్తులే ఎత్తుకెళ్లారా అని ఆరా తీస్తున్నారు. అత్తాపూర్ లాంటి రద్దీగా ఉండే ప్రాంతంలోనే అది కూడా నడిరోడ్డుపై ఓ యువతి కిడ్నాప్ అయిందనే వార్త కలకలం రేపింది.
హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో మంగళవారం ఓ యువతి కిడ్నాప్ అయిన వార్త సంచలనంగా మారింది. అందరూ చూస్తుండగానే.. థార్ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెను కారులో ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిసరాల్ని పరిశీలించారు. కిడ్నాప్ అయిన యువతి ఎవరూ..? సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
పోలీసులు యువతిని కారులో తీసుకెళ్లిన వ్యక్తులు నిజంగా కిడ్నాపర్ల లేక ఇందులో మరేదైనా కోణం ఉందా అని ఆరా తీస్తున్నారు. ఆ దిశగానే దర్యాప్తు జరుపుతున్నారు. నలుగురు యువకులతో కారులో వెళ్లిన యువతికి ఆ యువకులకు ముందే పరిచయం ఉందా.? లేకపోతే ఆమె గట్టిగా కేకలు వేసి ఉండేది కదా అని అనుమానిస్తున్నారు. ఈ కేసులో అసలేం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
జంటనగరాల పరిధిలో అర్ధరాత్రి ఉపాధి, ఉద్యోగాలు, కాలేజీలకు వెళ్లి తిరిగి ఇళ్లే సమయంలో మహిళలు, యువతులకు పోకిరిల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయనే దానిపై తాజాగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతను స్వయంగా పరిశీలించేందుకు లేడీ సీపీ (IPS) సుమతి సాధారణ యువతి వేషంలో అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించారు. సాధారణ మహిళలా దిల్సుఖ్నగర్ బస్టాప్‌లో ఒంటరిగా నిలబడగా, కేవలం 3 గంటల్లో సుమారు 40 మంది యువకులు ఆమెను సమీపించి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటనపై ప్రజల నుంచి, సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. సీపీ సాధారణ యువతిగా భావించి వేధించిన 40 మంది పోకిరీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇది జరిగిన రెండు వారాల్లోనే ఈ యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది.
Hyderabad,Telangana
















