Last Updated:
Hyderabad: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలోని ఉప్పల్ చౌరస్తా వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్ (గ్రేడ్ సెపరేటర్) పనుల్లో భాగంగా జలమండలి అత్యవసర మర్మమత్తులను నిర్వహించనుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఉప్పల్ క్రాస్‌రోడ్ వద్ద జరుగుతున్న గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వరంగల్ జాతీయ రహదారి వైపు వెళ్లే మార్గంలో ఇప్పటికే వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు, అక్కడ ఉన్న P15 పిల్లర్ ఫౌండేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు అడ్డుగా ఉన్న కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (KWSP) ఫేజ్-2, రింగ్ మెయిన్-2 పరిధిలోని 1600 మి.మీ వ్యాసం కలిగిన ప్రధాన ఎంఎస్ గ్రావిటీ పైప్‌లైన్ అనుసంధాన (జంక్షన్) పనులను తక్షణమే చేపట్టనున్నారు.
ఈ అత్యవసర ఇంజినీరింగ్ పనుల కారణంగా జూలై 27 ఉదయం 10:00 గంటల నుంచి జూలై 28 ఉదయం 10:00 గంటల వరకు (మొత్తం 24 గంటల పాటు) పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని హైదరాబాద్ జలమండలి (HMWS&SB) ఒక ప్రకటనలో తెలిపింది.
ఉప్పల్, నాచారం పరిసరాలు: ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, రామంతాపూర్, హెచ్ఎంటీ నగర్, బీరప్పగడ్డ, వెంకటరెడ్డి నగర్, మేకలమండి.
సికింద్రాబాద్, బోయిన్పల్లి జోన్: పద్మారావు నగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ, నార్త్ లాలాగూడ, అడ్డగుట్ట, బన్సీలాల్‌పేట్, సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతాలు, ఎంఈఎస్ (MES), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధులు.
బాలానగర్, కూకట్పల్లి వైపు: ఫతేనగర్, హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, బాలానగర్.
పాక్షికంగా ప్రభావం పడే ప్రాంతాలు: భోలక్‌పూర్, బౌద్ధనగర్, తార్నాక, లాలాపేట్.
మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే పైప్‌లైన్‌ను పునరుద్ధరించి, ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యతా క్రమంలో (దశలవారీగా) మంచినీటిని సరఫరా చేస్తామని అధికారులు వెల్లడించారు. నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, సరఫరా అయ్యే నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.
Hyderabad,Telangana














