Hyderabad: అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తిపోట్లు.. ఎందుకు దాడి చేశారో తెలిస్తే షాక్ | | ACTPnews

సోహైల్ (బాధితుడు), పీటర్ (నిందితుడు)


Last Updated:

USA: అమెరికాలోని ఉటా (Utah) రాష్ట్రంలో అత్యంత దారుణమైన ద్వేషపూరిత నేరం (Hate Crime) వెలుగుచూసింది.

సోహైల్ (బాధితుడు), పీటర్ (నిందితుడు)
సోహైల్ (బాధితుడు), పీటర్ (నిందితుడు)

కేవలం మతం కారణం చూపిస్తూ ఒక షాపింగ్ మాల్ ఉద్యోగిపై ఓ దుండగుడు కత్తితో కనీసం 15 సార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను ముస్లింలను చంపాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించడం అక్కడి వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ వెబ్‌సైట్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. వెస్ట్ వ్యాలీ సిటీలోని ‘వ్యాలీ ఫెయిర్ మాల్’ లో ఈ ఘోరం జరిగింది. మాల్లోని ఒక కియోస్క్‌లో పనిచేసే సోహైల్ అనే భారతీయ యువకుడిని టార్గెట్ చేస్తూ పీటర్ మైఖేల్ లార్సెన్ (48) అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. దాడికి ముందు నిందితుడు లార్సెన్ సోహైల్ వద్దకు వెళ్లి.. “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని అడిగాడు. దానికి సోహైల్ “నేను భారతదేశం (ఇండియా) నుండి వచ్చాను, నా పేరు సోహైల్” అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నిందితుడు “నువ్వు ముస్లింవా?” అని ప్రశ్నించగా, సోహైల్ “అవును” అని చెప్పాడు. అనంతరం తాగడానికి ఒక వాటర్ బాటిల్ కావాలని లార్సెన్ అడిగాడు. సోహైల్ బాటిల్ తీసుకోవడానికి వెనక్కి తిరగడమే ఆలస్యం.. లార్సెన్ తన వద్ద ఉన్న కత్తితో సోహైల్‌పై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించాడు.

ప్రాణాలు పణంగా పెట్టి అడ్డుకున్న స్థానికులు

లార్సెన్ చాలా క్రూరంగా సోహైల్ ఒంటిపై దాడి చేస్తుండటంతో పక్కనే ఉన్న జ్యువెలరీ షాప్ ఉద్యోగిని లూనా నూనెజ్ స్పందించారు. భయానక వాతావరణం మధ్య ఆమె నిందితుడిపైకి కుర్చీలు, షూస్ విసిరారు. ఆపై మాల్లోని మరికొందరు భక్తులు, స్థానికులు ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకుని కిందకు పడేసి బంధించారు. పోలీసులు వచ్చేసరికే నిందితుడిని స్థానికులు లొంగదీసుకున్నారు. ఈ దాడిలో సోహైల్ శరీరమంతటా తీవ్రమైన గాయాలై, రక్తం భారీగా కారిపోయింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.

సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి

నిందితుడు లార్సెన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి సాల్ట్ లేక్ కౌంటీ జైలుకు తరలించారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. లార్సెన్ తీవ్రమైన హింసాత్మక ఆలోచనలు, సిద్ధాంతాలు కలిగి ఉన్నాడని, సమాజానికి అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తని పోలీసులు కోర్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నిందితుడు గతంలో 2022లో కూడా ఒక హింసాత్మక ఘటనలో జైలుకు వెళ్లి, ఇటీవల జనవరి 2025లోనే విడుదలయ్యాడు.

ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం

బాధితుడు సోహైల్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అతడు హైదరాబాద్‌కు చెందినవాడని సమాచారం. ఆ కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి సోహైల్ మాత్రమే. ప్రస్తుతం అతనికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, వరుస సర్జరీలు జరుగుతుండటంతో చికిత్స ఖర్చుల నిమిత్తం స్నేహితులు ఆన్‌లైన్‌లో ‘గోఫండ్‌మీ’ (GoFundMe) ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.

ముస్లిం సంఘాల తీవ్ర ఖండన

ఈ దాడిని కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) తో పాటు పలు ముస్లిం హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఉటా ఇస్లామిక్ సెంటర్ ఇమామ్ షుఐబ్ దిన్ మాట్లాడుతూ, “పైకి ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడిలా కనిపించినా, ఇది మొత్తం సమాజంపై జరిగిన దాడి. దీనివల్ల ఇక్కడున్న మైనారిటీలంతా అభద్రతాభావానికి గురవుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పెరుగుతున్న ఇలాంటి ద్వేషపూరిత దాడులపై పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports