Last Updated:
బిర్యానీ, చాయ్ ప్రియులకు భారీ షాక్. దిమ్మతిరిగే అప్డేట్. ఫేమస్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు.
కమ్మని బిర్యానీ, ఘుమఘుమలాడే చాయ్ కోసం హైదరాబాద్‌లోని హోటళ్లకు వెళ్లే భోజనప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పేరుకే పెద్ద హోటళ్లు.. లోపల మాత్రం రోత పుట్టించే పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. నగరంలోని పలు ప్రసిద్ధ కేఫ్‌లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్, ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) సెప్టెంబర్ 2న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయి. నాసిరకం ఆహారం, అపరిశుభ్రత కారణాలతో ఏకంగా చార్మినార్ దగ్గర్లోని ఫేమస్ హోటల్ షాదాబ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్‌ను సస్పెండ్ చేయగా, మరో రెండు కేఫ్‌లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తిగా మూసివేశారు.














