Hyderabad: ORRపై ప్రమాదం.. దగ్ధమైన ఎయిర్ ఇండియా బస్సు! వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews

దగ్దమవుతున్న బస్సు


Last Updated:

క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు, భారీగా మంటలు ఎగసిపడటంతో వాహనం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది.

దగ్దమవుతున్న బస్సు
దగ్దమవుతున్న బస్సు

Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మంగళవారం మధ్యాహ్నం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ సమీపంలో ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఇండియా’ సంస్థకు చెందిన ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైందని అధికారులు వెల్లడించారు.

షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

కథనం ప్రకారం.. ఈ బస్సు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వర్క్‌షాప్ నుండి సర్వీసింగ్ నిమిత్తం ఆటోనగర్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో పెద్ద అంబర్‌పేట్ సమీపంలోకి రాగానే బస్సులో సాంకేతిక లోపం (షార్ట్ సర్క్యూట్) తలెత్తి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు, భారీగా మంటలు ఎగసిపడటంతో వాహనం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది.

సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం

బస్సులో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమయ్యారు. వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కదులుతున్న బస్సులోంచి కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఎలాంటి గాయాలు లేకుండా వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *