Last Updated:
Hyderabad Traffic Police: డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకోవడానికి రోడ్డు పక్కన బైక్ ఆపి వెళ్లి వచ్చేలోగా బైక్‌ని సీజ్ చేసి ట్రాలీ వెహికల్‌పైకి ఎక్కించారు. ఆ తర్వాత జరిగిన సీన్ పోలీసులపై విమర్శల వర్షం కురిపిస్తోంది. నెటిజన్ల నుంచి సవా లక్ష ప్రశ్నలు వస్తున్నాయి. అసలు బైక్ సీజ్ చేసిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోతో కూడిన స్టోరీ చూడండి.
Hyderabad Traffic Police: తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మోటర్ వాహనాల చట్టం, ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో చాలా స్ట్రిక్ట్‌గా , బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. అయినప్పటికి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మరింత కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైట్ కాప్స్ రూల్స్ పాటించని వారిపై అప్పటికప్పుడే చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఓ జెప్టో డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకోవడానికి రోడ్డు పక్కన బైక్ ఆపి వెళ్లి వచ్చేలోగా బైక్‌ని సీజ్ చేసి ట్రాలీ వెహికల్‌పైకి ఎక్కించారు. ఆ తర్వాత జరిగిన సీన్ పోలీసులపై విమర్శల వర్షం కురిపిస్తోంది. నెటిజన్ల నుంచి సవా లక్ష ప్రశ్నలు వస్తున్నాయి. అసలు బైక్ సీజ్ చేసిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోతో కూడిన స్టోరీ చూడండి.














