Hyderabad: అసెంబ్లీలో క్యూర్ బిల్లు ఆమోదం.. 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిన ఆస్తిపన్ను! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Hyderabad: హైదరాబాద్ మహానగర భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు – 2024’ (CURE)కు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మొదట ఈ బిల్లులో ఏటా ఆస్తిపన్నును 20 శాతం వరకు పెంచే వెసులుబాటును ప్రతిపాదించగా, పలువురు శాసనసభ్యుల అభ్యంతరాల మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తిపన్ను పెంపును ఏటా గరిష్ఠంగా 10 శాతానికే పరిమితం చేస్తూ సవరణ చేయడానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంగీకరించారు. ఈ సవరణతో సభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports