Last Updated:
Hyderabad: క్రీడారంగం పరంగా తెలంగాణ ఖ్యాతి భవిష్యత్తులో మరింత పెరుగనుంది. తెలంగాణ రాజధాని నగరంగా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక ఐకానిక్ కట్టడాలు ప్రపంచ దేశాల ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఈక్రమంలోనే మరో అద్భుతమైన నిర్మాణానికి పునాది పడబోతోంది.
Hyderabad: క్రీడారంగం పరంగా తెలంగాణ ఖ్యాతి భవిష్యత్తులో మరింత పెరుగనుంది. తెలంగాణ రాజధాని నగరంగా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక ఐకానిక్ కట్టడాలు ప్రపంచ దేశాల ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఈక్రమంలోనే మరో అద్భుతమైన నిర్మాణానికి పునాది పడబోతోంది. మన దేశంలో క్రికెట్ లవర్స్‌కి కొదవే లేదు. 140 కోట్ల జనాభాలో సుమారు 80శాతానికిపైగా అభిమానించే క్రికెట్ ఆటకు హైదరాబాద్ మరో అతిపెద్ద వేదికగా మారబోతోంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను సుమారు 100 ఎకరాల స్తలంలో నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రణాళికలు, నమూన వీడియో,ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం పేరుతో గుజరాత్లో ఉంది. దీని కంటే పెద్దగా ఫ్యూచర్ సిటీలో నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.














