Impure Movie: అమెరికా నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి.. ‘ఇంప్యూర్’తో కొత్త ప్రయాణం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల. విదేశాలు వెళ్ళినా సరే మనసంతా ఇండియాపై, సినిమాపై ఉంది. సినిమాలపై ఇష్టంతో రచయితగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.

News18
News18

అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల. విదేశాలు వెళ్ళినా సరే మనసంతా ఇండియాపై, సినిమాపై ఉంది. సినిమాలపై ఇష్టంతో రచయితగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి వారాహి నిర్మించిన ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా ‘ఇంప్యూర్’. ఈ చిత్రానికి ఆమె కథ అందించడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటించారు. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన తారాగణం. ఇటీవల జరిగిన ‘ఇంప్యూర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి అటెండ్ అయ్యారు. అక్టోబర్ 2న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది.

ఇటీవల విడుదలైన ‘ఇంప్యూర్’ ట్రైలర్, ‘ఓఎంజీ’ (ఓ మై గాడ్) పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘ఓఎంజీ’ సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే… తెలుగు మూలాలు ఉన్న అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజ కుమారి పాడటం. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టైటిల్ ట్రాక్ పాడినది ఆవిడే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘ధోప్…’ కూడా పాడారు. ఇక… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ‘ఫైర్ స్ట్రోమ్’ అయితే ఛార్ట్ బస్టర్ అయ్యింది. ‘ఓజీ’ సాంగ్ తర్వాత తెలుగులో రాజ కుమారి పాడిన పాట ‘ఇంప్యూర్’లో ‘ఓఎంజీ’ కావడం విశేషం. ఈ పాటకు తెలుగు లిరిక్స్ కడలి సత్యనారాయణ అందించారు. ఈ సినిమాతో రాజ కుమారి సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ పాటతో పాటు మరొక పాటను పాడటమే కాదు… సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో ఆమె నటించించారని నిర్మాత శ్రీదేవి మల్లిపాముల తెలిపారు.

‘ఇంప్యూర్’ సినిమా గురించి నిర్మాత శ్రీదేవి మల్లిపాముల మాట్లాడుతూ… ”కాలంతో పాటు సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను చూపిస్తూ మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన చిత్రమిది. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తుంది. మానవ సంబంధాల నేపథ్యంలో, మోడ్రన్ జనరేషన్ – అంతకు ముందు తరం మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలనేది చెబుతూ తీసిన చిత్రమిది. జెన్ జి మాత్రమే కాదు… అన్ని వయసుల వాళ్ళను, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమిది” అని చెప్పారు.

యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇంప్యూర్’ సినిమాలో రాజకుమారి ప్రత్యేక పాత్రలో నటించారు. అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ: వారాహి మల్లిపాముల, ఎడిటర్స్: అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్, ఒరిజినల్ స్కోర్: కరణ్ పాండవ్ & నిర్వాణ్ ఆత్రేయ, సినిమాటోగ్రాఫర్: జ్ఞానశేఖర్ వీఎస్, మ్యూజిక్ డైరెక్టర్: రాజ కుమారి & కరణ్ పాండవ్, ప్రొడ్యూసర్స్: వారాహి మల్లిపాముల & శ్రీదేవి మల్లిపాముల, డైరెక్టర్: నిశాంతి ఇవని.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports