IND vs AFG: ఒక్క బంతి పడకుండానే సెమీస్ చేరిన భారత్, పాకిస్తాన్.. ఇరు దేశాల మధ్య పోరు ఎప్పుడంటే? | క్రీడా వార్తలు | ACTPnews

టీమిండియా


Last Updated:

IND vs AFG, Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 ()లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్ చేరింది.

టీమిండియా
టీమిండియా

ఒక్క బంతి పడకుండానే.. రిజల్ట్ తేలకుండానే భారత క్రికెట్ జట్టు సెమీస్ చేరగా.. అఫ్గానిస్తాన్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక సెమీఫైనల్లో శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే పోరులో గెలిచే జట్టుతో భారత జట్టు తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సోమవారం ఉదయం 10:30 గంటలకు జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది. భారీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా మెరుగైన సీడింగ్ కారణంగా భారత జట్టు సెమీస్ చేరింది.

పాకిస్తాన్ కూడా

ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒక్క బంతి కూడా ఆడకుండానే దర్జాగా సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. జపాన్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో సోమవారం జరగాల్సిన రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లూ ఎడతెరిపిలేని వర్షం కారణంగా పూర్తిగా రద్దయ్యాయి.  భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం వల్ల రద్దు కాగా, మరో మ్యాచ్‌లో పాకిస్తాన్, హాంకాంగ్ (చైనా)ల పోరు కూడా వర్షార్పణమైంది. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌లు రద్దయిన పక్షంలో మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ లేదా ఉన్నత సీడింగ్ కలిగిన జట్లే ముందంజ వేస్తాయి. ఈ నిబంధనల ఆధారంగా అధిక సీడింగ్ జట్లైన భారత్, పాకిస్తాన్‌లు నేరుగా సెమీఫైనల్స్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి.

ఇక భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య పోరు జరగాలంటే మాత్రం ఈ సమీకరణాలు జరగాల్సి ఉంది. ఇరు జట్లు సెమీస్‌లో తమ ప్రత్యర్థులపై నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే ఇరు జట్లు తమ ప్రత్యర్థులపై సెమీస్‌లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు గోల్డ్ లేదా కాంస్య పతక మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు పోటీ పడే అవకాశం ఉంది. సెమీస్‌లో భారత్ గెలిచి.. పాకిస్తాన్ ఓడినా.. లేదంటే పాకిస్తాన్ గెలిచి భారత్ ఓడినా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగదు. సెమీస్‌లో శ్రీలంకతో భారత్.. బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడే అవకాశాలు ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed