Last Updated:
రెండు రోజుల క్రితం ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించగా, ఆర్చర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
IND vs ENG: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టి ఆ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అయినప్పటికీ, ఐపీఎల్లో బౌలర్లకు ఏమాత్రం అలసత్వం వహించే అవకాశం ఉండదన్నాడు. అందుకు కారణం అక్కడి ఫ్లాట్ పిచ్‌లు, చిన్న బౌండరీలు బౌలర్ల జీవితాన్ని కష్టతరం చేస్తాయని ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే ఐపీఎల్లో వాడే పిచ్‌లను ట్రోల్ చేశాడు.
రెండు రోజుల క్రితం ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించగా, ఆర్చర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఐపీఎల్లో భారత బ్యాటర్లను ఎదుర్కొన్న అనుభవం ఉన్న నేపథ్యంలో, ఇక్కడ ఇంగ్లాండ్‌లో వారిపై మీ వ్యూహాలు ఎంతవరకు మారతాయన్న ప్రశ్నకు ఆర్చర్ సమాధానమిస్తూ.. “ఇక్కడ (ఇంగ్లాండ్‌లో) పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. ఇక్కడ సరైన లెంగ్త్‌లో నేరుగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ అక్కడ (భారత్‌లో/ఐపీఎల్లో) వికెట్లు బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటాయి. బౌండరీలు చాలా చిన్నవి. అందుకే అక్కడ ప్రతి బంతిని చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లో బౌలర్లకు తప్పులు సరిదిద్దుకునే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది” అని అన్నాడు.
మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుత హాఫ్ సెంచరీ (70 పరుగులు) చేయడంతో మొదట ఇంగ్లాండ్ 201/7 పరుగుల సవాలుతో కూడిన స్కోరు సాధించింది. అనంతరం ఛేదనకు దిగిన టీమిండియా కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో ఇంగ్లాండ్ 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించగా.. పరుగుల పరంగా టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యంత భారీ ఓటమిగా నమోదైంది.
“ఐపీఎల్లో కొన్నిసార్లు 200 పరుగుల స్కోరు కూడా సురక్షితం కాదు. ఈ పిచ్‌పై 200 పరుగులు బోర్డుపై ఉన్నప్పుడు.. మేము పూర్తిగా గెలుస్తామని ధీమాగా చెప్పలేను కానీ, దీనిని ఛేదించాలంటే ఒక ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుందని నాకు తెలుసు. బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరూ వికెట్లు తీశారు. ఇది ఒక పరిపూర్ణమైన బౌలింగ్ ప్రదర్శన” అని ఆర్చర్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో టంగ్‌తో కలిసి ఆర్చర్ తన పేస్, బౌన్స్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయితే, నాటింగ్‌హామ్‌లో తాము సాధించిన ఆధిపత్యానికి ఇంగ్లాండ్ బౌలర్ల క్రమశిక్షణే కారణమని ఆర్చర్ అన్నాడు. తమ పేస్ భారత్‌ను కంగారు పెట్టిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. “నిజానికి అలా ఏం లేదు. మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా మేమిద్దరం బాగానే బౌలింగ్ చేశాం, కానీ అక్కడ మాకు వికెట్లు దక్కలేదు, ఈరోజు దక్కినందుకు సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు అంత ఎక్కువ పేస్ ఏమీ లేదు. కాకపోతే బలమైన గాలి వీయడం వల్ల బంతి కాస్త వేగంగా దూసుకొచ్చినట్లు అనిపించి ఉండవచ్చు” అని ఆర్చర్ వివరించాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ గురువారం బ్రిస్టల్ వేదికగా జరగనుంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jul 09, 2026 12:49 PM IST













