IND vs ENG 3rd ODI: రోహిత్ సెంచరీ వృథా.. మూడో వన్డేలో పోరాడి ఓడిన భారత్ | క్రీడా వార్తలు | ACTPnews

రోహిత్ శర్మ


Last Updated:

IND vs ENG 3rd ODI: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు పోరాడి ఓడింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కొండంత లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రోహిత్ శర్మ సెంచరీ (110 బంతుల్లో 138; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వృథాగా నిలిచింది.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ

50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో నెగ్గింది. దాంతో 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. విరాట్ కోహ్లీ (74), శుబ్‌మన్ గిల్ (77) మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్యామ్ కరణ్ 4 వికెట్లతో మెరిశాడు. ఐర్లాండ్ చేతిలో టి20 సిరీస్ ఓటమి.. ఇంగ్లండ్ చేతిలో టి20 సిరీస్, వన్డే సిరీస్‌ల్లో కూడా ఓడిన భారత్.. యూరప్ పర్యటనను నిరాశతో ముగించింది. మూడో వన్డేలో మిడిలార్డర్ ప్లేయర్లలో ఇద్దరు నిలబడి ఆడినా టీమిండియా గెలిచి ఉండేది. టాప్ 3 తప్ప మిగిలిన ప్లేయర్లు దారుణంగా ఆడారు.

ఓపెనర్ల శుభారంభం

ఛేదనలో భారత జట్టుకు ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మలు శుభారంభం చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించారు. అనంతరం గిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మతో కలిసి లక్ష్యం వైపు నడిచారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. లార్డ్స్‌లో వన్డే ఫార్మాట్‌లో సెంచరీ బాదిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. అయితే క్రాంప్స్‌తో ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా హిట్టింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే అవుటయ్యాడు. అయితే రోహిత్ అవుటైన తర్వాత భారత్ వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0) వెంట వెంటనే అవుటయ్యారు. కోహ్లీ కూడా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (12) కూడా ఎక్కువ సేపు నిలడబడలేదు. దాంతో భారత ఓటమి ఖాయమైంది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. బెన్ డకెట్ (135 బంతుల్లో 141; 18 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కాడు. బెతెల్ (93 బంతుల్లో 91; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు. జో రూట్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు) తన ఫామ్‌ను ప్రదర్శించాడు. రూట్‌కు ఇది హ్యాట్రిక్ అర్ధ సెంచరీలు. ఇక చివర్లో జాస్ బట్లర్ (13 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చుక్కలు చూపించాడు. ఫలితంగా ఇంగ్లండ్  భారీ స్కోరును సాధించింది. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణకు 2 వికెట్లు లభించాయి.  మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పుడు భారత బ్యాటర్ల మీదే భారం.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed