FIFA World Cup 2026 Final: వారెవ్వా టొర్రెస్.. ఫైనల్లో అర్జెంటీనాకు చుక్కెదురు.. జగజ్జేతగా నిలిచిన స్పెయిన్ | క్రీడా వార్తలు | ACTPnews

PC:  Omar HQ/X.com


Last Updated:

FIFA World Cup 2026 Final: వరుస విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన అర్జెంటీనాకు ఫైనల్లో చుక్కెదురైంది. అటాకింగ్.. ఇటు డిఫెన్స్‌తో అదరగొట్టిన స్పెయిన్ ఫుట్‌బాల్ జగజ్జేతగా నిలిచింది.

PC:  Omar HQ/X.com
PC: Omar HQ/X.com

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్ పోరులో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై సూపర్ విజయాన్ని సాధించింది. స్పెయిన్ స్ట్రయికర్ ఫెర్రాన్ టొర్రెస్ 106వ నిమిషంలో కళ్లు చెదిరే గోల్ చేసి స్పెయిన్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు. అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుగోడగా నిలిచినా.. అద్భుతమైన పాస్‌లతో స్పెయిన్ ఏకైక గోల్ చేసి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌ల్లో ఓడిపోయే స్థితి నుంచి గెలిచిన అర్జెంటీనా ఫైనల్లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ నెగ్గాలన్న లియోనెల్ మెస్సీకి నిరాశే మిగిలింది. ఇక 2010లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ నెగ్గిన స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలవడం విశేషం.

సూపర్ గోల్

నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్టు కూడా గోల్ చేయడంలో సఫలం కాలేదు. దాంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. తొలి 15 నిమిషాల్లో గోల్ పడలేదు. అయితే 106వ నిమిషంలో విలియమ్స్ హెడర్‌తో అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినేజ్‌ను తికమక పెడుతూ వెనక్కి పాస్ ఇచ్చాడు. అక్కడే కాచుకొని ఉన్న టొర్రెస్ కళ్లు చెదిరే గోల్ చేశాడు. ఆ తర్వాత అర్జెంటీనా గోల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్పెయిన్ డిఫెండర్లు అడ్డుకున్నారు.

మైదానంలో స్పెయిన్ హవా..

అంతకుముందు జరిగిన నిర్ణీత 90 నిమిషాల ఆటలో స్పెయిన్ హవా నడిచింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి స్పెయిన్ జట్టు బంతిని ఎక్కువ సేపు తమ ఆధీనంలో ఉంచుకుంటూ అర్జెంటీనాపై ఒత్తిడి తెచ్చింది. మ్యాచ్ 5వ నిమిషంలోనే స్పెయిన్ యువ సంచలనం లామైన్ యమల్ గోల్ చేయడానికి అద్భుతమైన ప్రయత్నం చేశాడు. డాని ఒల్మో అందించిన పాస్‌తో గోల్ వైపు దూసుకెళ్లినప్పటికీ అర్జెంటీనా కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అలవోకగా దానిని అడ్డుకున్నాడు.

నిశ్శబ్దంగా మెస్సి: అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సిని స్పెయిన్ డిఫెండర్లు చాలా వ్యూహాత్మకంగా మార్క్ చేశారు. ప్రథమార్ధంలో మెస్సికి పెద్దగా బంతిని అందుకునే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు.

అర్జెంటీనాకు ఎదురుదెబ్బలు

లిసాండ్రో మార్టినెజ్ గాయం: 44వ నిమిషంలో అర్జెంటీనా స్టార్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ మోకాలి గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతని స్థానంలో నికోలాస్ ఒటమెండి మైదానంలోకి వచ్చాడు.

ఎన్జో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్

మ్యాచ్ ముగిసే సమయానికి (90+2వ నిమిషంలో) అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎన్జో ఫెర్నాండెజ్ రెండో ఎల్లో కార్డు (రెడ్ కార్డ్) అందుకొని మైదానం నుండి వెలుపలికి వెళ్ళాడు. దీంతో అర్జెంటీనా జట్టు మైదానంలో 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. నిర్ణీత సమయం ముగిసే వరకు స్పెయిన్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ గోడలా నిలిచి స్పెయిన్ ప్రయత్నాలను తిప్పికొట్టడంతో మ్యాచ్ డ్రాగా ముగిసి ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports