IND vs ENG 3rd T20: నిలబడలేదు.. ఆడలేదు.. మూడో టి20లో టీమిండియా ఘోర ఓటమి.. 100 కూడా చేయలేదు | క్రీడా వార్తలు | ACTPnews

PC: ICC


Last Updated:

IND vs ENG 3rd T20: ఇంగ్లండ్ (IND vs ENG)తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మూడో టి20లో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడింది.

PC: ICC
PC: ICC

ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 125 పరుగుల తేడాతో అతిపెద్ద ఓటమిని చవిచూసింది. భారత టి20 చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 76 పరుగులకే చాపు చుట్టేసింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో 74 పరుగుల అత్యల్ప స్కోరును మాత్రం దాటింది. లేదంటే మరీ ఘోరంగా ఉండేది. ఒక్కడు కూడా నిలబడి ఆడలేకపోయాడు. వచ్చినవాడు వచ్చినట్లు పెవిలియన్‌కు చేరాడు. టీమిండియా తరఫున వైభవ్ సూర్యవంశీ (13) టాప్ స్కోరర్‌ కావడం భారత బ్యాటింగ్ దరిద్రానికి నిదర్శనం. 13 పరుగులు టాప్ స్కోర్ అంటే టీమిండియా ఎంత దరిద్రంగా ఆడిందో ఇట్టే తెలుసుకోవచ్చు.

తొలుత బ్యాటంగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (70), జాస్ బట్లర్ (36) రాణించారు. చివర్లో స్యామ్ కరణ్ (41 నాటౌట్) చుక్కలు చూపించాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణాలు చెరో 2 వికెట్లు సాధించారు. 6గురు బౌలింగ్ చేస్తే ప్రిన్స్ యాదవ్ మాత్రమే 7.50 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగతా వాళ్లంతా 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు పూర్తిగా తడబడింది. ఓపెనర్లు ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు ఎలా ఆడాలో తెలియక ఓపెనర్లను ఫాలో అయ్యారు. జాష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌కు వణికిపోయారని చెప్పొచ్చు. టంగ్ 4 వికెట్లు తీస్తే.. ఆర్చర్ 3 వికెట్లు సాధించాడు. ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు. దెబ్బకు భారత్ 76 పరుగులకు కుప్పకూలింది. తొలి టి20 వర్షంతో రద్దు కాగా.. రెండో టి20లో గెలిచే మ్యాచ్‌లో భారత్ ఓడింది. ఇక మూడో టి20లో చిత్తు చిత్తుగా ఓడింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఒక్క టి20 విజయం కూడా లేకపోవడం విశేషం.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports