IND vs ENG 5th T20: సరిపోలేదు.. ఐదో టి20లోనూ టీమిండియా ఓటమి.. పగ తీర్చుకున్న ఇంగ్లండ్ | క్రీడా వార్తలు | ACTPnews

తిలక్ వర్మ


Last Updated:

IND vs ENG 5th T20: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ఓటమితో ముగించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టి20లో భారత జట్టు 56 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ముగించింది.

తిలక్ వర్మ
తిలక్ వర్మ

IND vs ENG 5th T20: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ఓటమితో ముగించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టి20లో భారత జట్టు 56 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ముగించింది. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన తర్వాత భారత జట్టుకు మరో టి20 సిరీస్ ఓటమి ఎదురైంది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు).. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా అది భారత విజయానికి సరిపోలేదు. శ్రేయస్ అయ్యర్ (28), సంజూ సామ్సన్ (27) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. స్యామ్ కరణ్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆదిల్ రషీద్‌కు 2 వికెట్లు లభించాయి. టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి ఈ సిరీస్ విజయాలతో పగ తీర్చుకున్నట్లైంది.

భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టుకు శుభారంభం లభించలేదు. అభిషేక్ శర్మ (3) త్వరగా అవుటయ్యాడు. అయితే మరో ఎండ్‌లో సంజూ సామ్సన్ ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. అయితే స్యామ్ కరణ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు కాసేపు నిలబడే ప్రయత్నం చేశారు. అయితే డ్రింక్స్ బ్రేక్ అనంతరం అయ్యర్ అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ వేగంగా ఆడాడు. అయితే అర్ధ సెంచరీల తర్వాత అటు ఇషాన్ కిషన్, ఇటు తిలక్ వర్మ అవుటయ్యారు. శివమ్ దూబే (14) నిరాశ పరిచారు. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో భారత జట్టు ఓటమి ఖాయమైంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. కెప్టెన్ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) కూడా చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. రెండో వికెట్‌కు బట్లర్, బ్రూక్ 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports