IND vs IRE 2nd T20: టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్.. పరుగు తేడాతో ఓడిన టీమిండియా.. సిరీస్ పాయె! | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

155 పరుగుల తేడాతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు చివరి బంతి వరకు పోరాడింది. అయితే టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో సులభంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది.

PC: X.com
PC: X.com

IND vs IRE 2nd T20: భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం చేదు రోజుగా మిగలనుంది. మహిళల టి20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026) నుంచి భారత జట్టు నిష్క్రమించగా.. ఐర్లాండ్ చేతిలో భారత పురుషుల జట్టు వరుసగా రెండో ఓటమిని చవి చూసింది. 155 పరుగుల తేడాతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు చివరి బంతి వరకు పోరాడింది. అయితే టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో సులభంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. తిలక్ వర్మ (46 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశాడు. అయితే చివర్లో అవుటవ్వడం.. అప్పటికే బ్యాటర్లందరూ పెవిలియన్ చేరడంతో ఆఖరి బంతికి ఓడింది. కేవలం పరుగు తేడాతో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. హర్షిత్ రాణా (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆడినట్లు కూడా టాపార్డర్ బ్యాటర్లు ఆడలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో జై ముంద్రా, మ్యాట్ హాలండ్ చెరో 3 వికెట్లు సాధంచారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. టీమిండియా ముందు కఠినమైన లక్ష్యాన్నే ఉంచగలిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (47 బంతుల్లో 53 ; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. బెన్ (37) ఆకట్టుకున్నాడు. తొలి టి20తో పోలిస్తే ఈ స్కోరు తక్కువే అయినప్పటకీ పోరాడే లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఇక భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగాడు.  శివమ్ దూబే, అర్ష్ దీప్ సింగ్ తలా రెండేసి వికెట్లు సాధించారు. హర్షిత్ రాణా ఒక వికెట్ తీశాడు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports