IND vs IRE 2nd T20: డెబ్యూ మ్యాచ్‌లో అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews

PC: BCCI


Last Updated:

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. టీమిండియా ముందు కఠినమైన లక్ష్యాన్నే ఉంచగలిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (47 బంతుల్లో 53 ; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు.

PC: BCCI
PC: BCCI

IND vs IRE 2nd T20: భారత్‌తో జరుగుతున్న రెండో టి20లో ఐర్లాండ్ (IND vs IRE 2nd T20) బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. టీమిండియా ముందు కఠినమైన లక్ష్యాన్నే ఉంచగలిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (47 బంతుల్లో 53 ; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. బెన్ (37) ఆకట్టుకున్నాడు. తొలి టి20తో పోలిస్తే ఈ స్కోరు తక్కువే అయినప్పటకీ పోరాడే లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఇక భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగాడు.  శివమ్ దూబే, అర్ష్ దీప్ సింగ్ తలా రెండేసి వికెట్లు సాధించారు. హర్షిత్ రాణా ఒక వికెట్ తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. అయితే హ్యారీ టెక్టర్ నిలబడటంతో ఐర్లాండ్ నిలబడింది. బెన్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా ఐర్లాండ్ మంచి స్కోరును సాధించింది. ఇక డెబ్యూ చేసిన ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. 4 ఓవర్ల స్పెల్‌లో 3 వికెట్లు తీసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports