Last Updated:
IND W vs BAN W, Asian Games 2026: ఆసియా కప్ 2026 (Asia Cup 2026)లో ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026)లో కూడా అదరగొడుతోంది.
ఆసియా గేమ్స్‌లో భారత జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కింది. స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో నందని శర్మ, దీప్తి శర్మలు చెరో 3 వికెట్లతో రాణించారు. ఫైనల్లో భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై శ్రీలంక నెగ్గి ఫైనల్ చేరింది.
196 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ నిలబడలేకపోయింది. 15.4 ఓవర్లలో కేవలం 81 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో దిలారా అక్తర్ (23 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), సుల్తానా ఖతూన్ (8 బంతుల్లో 12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3 వికెట్లు), నందని శర్మ (3 వికెట్లు) ప్రత్యర్థి నడ్డి విరవగా, శ్రీ చరణి 2 వికెట్లు, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు.














