INDIA bloc Delhi protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ గద్దె దిగాల్సిందే.. ఢిల్లీలో నేడు విపక్షాల నిరసన! | | ACTPnews

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

[ad_1]

Last Updated:

INDIA bloc Delhi protest: ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ – SIR) విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమి సోమవారం (అక్టోబరు 12) దేశ రాజధాని ఢిల్లీలో మరో విడత భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది.

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

సుప్రీంకోర్టు వైపు కవాతు నిర్వహించి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరాలని విపక్ష కూటమి నిర్ణయించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ప్రణాళికాబద్ధమైన నిరసన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరినీ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

సమావేశానికి నిరాకరించిన సీజేఐ

అయితే, ప్రతిపక్ష నేతల భేటీ విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించారు. ఈ అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో (సబ్-జ్యుడీస్) ఉన్నందున, పరిపాలనాపరమైన వినతిపత్రాల కంటే పిటిషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడమే సముచితమని స్పష్టం చేశారు. ఈ మేరకు తిరస్కరణకు గల కారణాలను వివరిస్తూ నాయకులకు ఈ-మెయిల్ ద్వారా సమాధానం పంపినట్లు సమాచారం. ఇంతకుముందు విపక్ష కూటమి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఇదే అంశంపై వినతిపత్రం అందజేసిన సంగతి తెలిసిందే.

యువతపై కేంద్రం అణచివేత: రాహుల్ గాంధీ ఆగ్రహం

శనివారం నాటి ఆందోళనల సందర్భంగా పోలీసులు, బీజేపీ శ్రేణులు విద్యార్థులు, మహిళలపై దాడులకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిధిలోని ఢిల్లీ పోలీసులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేశంలో అసమ్మతి గళాన్ని తొక్కిపెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. శనివారం జరిగిన ఘటనలకు నిరసనగా అక్టోబరు 12న కాంగ్రెస్, ఇండియా కూటమి, దేశ యువత మరోసారి రోడ్లపైకి వచ్చి గళమెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.

భారీ నిర్బంధాలు.. తీవ్ర ఉద్రిక్తతలు

జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు యత్నించిన సుమారు 7,000 మంది ఆందోళనకారులను పోలీసులు శనివారం వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ వంటి కీలక నేతలను పోలీసులు నిర్బంధించారు. ఎస్ఐఆర్ అంశంపై రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలూ ఏకం కావాలని నేతలు పిలుపునిచ్చారు.

సాధారణ సేవలకు ఆటంకం కలగకూడదు.. సుప్రీంకోర్టు ఆదేశం

ఆందోళనల నేపథ్యంలో ట్రాఫిక్, మెట్రో సేవలకు ఆటంకాలు కలగడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. శాంతిభద్రతల పరిమితులకు లోబడి ఢిల్లీ మెట్రో రాకపోకలు, ఇంటర్నెట్ సేవలు సాధారణంగా కొనసాగేలా చూడాలని, న్యాయవాదులు, జర్నలిస్టుల విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయస్థానం ఆదేశించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports