Last Updated:
భారత వాయుసేనలో ఇప్పటివరకు ఏ మహిళా సాధించని ఘనతను ఆమె సొంతం చేసుకుంది. 20 వారాల అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసి కొత్త చరిత్ర సృష్టించింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆమె సాధించిన ‘టాప్ గన్’ ఘనత ఏమిటి? భావనా కాంత్ విజయగాథలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
భారత వైమానిక దళం (IAF)లో మహిళల ప్రస్థానం మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ ప్రతిష్ఠాత్మక ఫైటర్ కంబాట్ లీడర్ (Fighter Combat Leader-FCL) కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. సుమారు 20 వారాల పాటు నిర్వహించిన అధునాతన యుద్ధ విమాన శిక్షణను పూర్తి చేసి, క్లిష్టమైన వైమానిక యుద్ధ కార్యకలాపాలకు నాయకత్వం వహించే అర్హతను పొందారు. ఈ కోర్సు భారత వైమానిక దళంలోని అత్యంత కఠినమైన శిక్షణా కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.














