Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ఆ ప్రకటనలు.. మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ నోటీసులు! | | ACTPnews

ఫైల్ ఫోటో


Last Updated:

Instagram: సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ అధీనంలోని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా చిన్నపిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వస్తున్న ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

చిన్నారులపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన (CSEAM) కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటా సంస్థకు గట్టి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఏడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

అసలేంటి ఈ వివాదం?

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) నిర్వహించిన ఓ పరిశోధనాత్మక కథనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను ప్రమోట్ చేసేందుకు డబ్బులు చెల్లించి మరీ ప్రకటనలు (Paid Ads) ఇస్తున్నట్లు బీబీసీ గుర్తించింది.

టెలిగ్రామ్ లింకులు: ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను ‘టెలిగ్రామ్’ యాప్‌లోని కొన్ని ఛానల్స్‌కు మళ్లిస్తున్నారు. అక్కడ కేవలం ₹99 లకే చిన్నారుల లైంగిక వేధింపుల వీడియోలను విక్రయిస్తున్నట్లు తేలింది.

కీవర్డ్స్ వాడకం: ఈ దారుణమైన ప్రకటనల కోసం ‘రేప్ వీడియో’, ‘చైల్డ్ వీడియో’ వంటి పదాలను బహిరంగంగానే ఉపయోగించారు. బీబీసీ దాదాపు 30కి పైగా ఇటువంటి ప్రకటనలను గుర్తించింది.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వివాదం: ఒక ఏడుస్తున్న చిన్నారి ఫోటోతో ఉన్న ప్రకటనపై బీబీసీ ప్రతినిధులు ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రశ్నించగా.. అది తమ ‘కమ్యూనిటీ ప్రమాణాల’ను ఉల్లంఘించలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం గమనార్హం.

ఈ నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వ్యవహారంపై తక్షణమే వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే శుక్రవారం మెటా ఉన్నతాధికారులను ప్రభుత్వం పిలిపించి విచారించింది.

అల్గారిథమ్స్ నిలిపివేయాలి: కేంద్రం ఆదేశం

చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించే అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్స్ (Algorithmic Amplification) ద్వారా ఇటువంటి అసభ్యకరమైన కంటెంట్‌ మరింత మందికి చేరడాన్ని నిరోధించేందుకు తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మెటాను ఆదేశించింది.

మెటా సంస్థ స్పందన

బీబీసీ నివేదికపై మెటా ప్రతినిధి ఒకరు ఈమెయిల్ ద్వారా స్పందించారు. “చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌ను (CSAM) మా వేదికలపై షేర్ చేయడం లేదా అడగడాన్ని మేము ఏమాత్రం సహించం. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడానికి మేము అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుతున్నాము. అయితే, మాకున్న 350 కోట్ల మంది వినియోగదారులలో దాగి ఉండి, మా నిఘా నేత్రం నుంచి తప్పించుకోవాలని చూసే నేరగాళ్లతో మేము నిరంతరం పోరాడాల్సి వస్తోంది” అని పేర్కొన్నారు. ఇటువంటి వేటాడే ముఠాలను ఏరిపారేయడానికి తమ నిపుణుల బృందం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు.

చట్టం ఏం చెబుతోంది?

భారత ఐటీ చట్టం (IT Act) లోని సెక్షన్ 67(B) ప్రకారం.. చిన్నారులకు సంబంధించిన లైంగిక వేధింపులు లేదా అసభ్యకరమైన కంటెంట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం, షేర్ చేయడం లేదా ప్రసారం చేయడం చట్టరీత్యా తీవ్రమైన శిక్షార్హమైన నేరం. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం ఇటువంటి కంటెంట్‌ను ‘CSEAM’ పరిధిలోకి తీసుకువస్తారు. పర్యాటకులు లేదా సోషల్ మీడియా వినియోగదారులు ఎవరైనా ఇటువంటి అవాంఛనీయ కంటెంట్‌ను చూస్తే వెంటనే రిపోర్ట్ లేదా ఫ్లాగ్ చేయవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports