IPL: వంట మనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్స్ విధ్వంసకర ప్లేయర్‌పై FIR | క్రీడా వార్తలు | ACTPnews

credit: x


Last Updated:

IPL: ఐపీఎల్ (IPL) ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్‌తో పాటు ఆయన తండ్రి, విశ్రాంత ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

credit: x
credit: x

తమ ఇంట్లో పనిచేసే వంట మనిషిపై భౌతిక దాడికి పాల్పడటం, అసభ్య పదజాలంతో దూషించడం, బలవంతంగా గదిలో బంధించారనే ఆరోపణలపై భోపాల్ పోలీసులు వీరిపై శనివారం (జూన్ 29, 2026) క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వీరి కుటుంబ డ్రైవర్ మిశ్రాను కూడా సహ నిందితుడిగా చేర్చారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాతీబడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ ఘోర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నెలకు రూ.15,000 జీతం.. ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపి..

మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ (31) అనే వ్యక్తి పరిచయస్తుల ద్వారా జూన్ 25న భోపాల్‌లోని మెందోరి గ్రామంలో ఉన్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి బంగ్లాలో వంట మనిషిగా చేరాడు. నెలకు రూ.15,000 జీతంతో పాటు ఉచిత వసతి, భోజనం ఇస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా సహాయం చేస్తామని నమ్మించి అతడిని పనిలో పెట్టుకున్నారు.

రుచి బాలేదని వేధింపులు.. ఫోన్ లాక్కుని దాడి

బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ పోలీసులకు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రకారం.. తాను పనిలో చేరిన కొన్ని గంటల్లోనే వండిన ఆహారం నాణ్యత, రుచి బాలేదంటూ శశాంక్ సింగ్ కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు. బూతు పురాణంతో వేధించడం ప్రారంభించారు. ఇంట్లోని ఘోరమైన వాతావరణాన్ని చూసి తాను ఉద్యోగం వదిలేసి సొంతూరికి వెళ్ళిపోతానని చెప్పడంతో నిందితులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

బాధితుడు బయటి వ్యక్తులకు సమాచారం అందించకుండా ఉండేందుకు అతని మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. వారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి విపేంద్ర ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగా.. క్రికెటర్ శశాంక్ సింగ్, ఆయన ఐపీఎస్ తండ్రి మరియు డ్రైవర్ కలిసి గది తలుపులు బద్దలుకొట్టి లోపలికి దూసుకెళ్లారు. విపేంద్రపై తీవ్రంగా భౌతిక దాడి (బేగరితనం) చేసి, గాయపరిచి బంగ్లా నుండి బయటకు గెంటివేశారు.

వైద్య పరీక్షల్లో నిర్ధారణ.. పోలీసుల విచారణ

బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విపేంద్ర ముఖం, శరీరంపై స్పష్టమైన గాయాల గుర్తులు ఉన్నట్లు వైద్య నివేదికలో నిర్ధారణ అయింది.

దీని ఆధారంగా రాతీబడ్ పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని క్రింది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు:

సెక్షన్ 296(B): బహిరంగంగా అసభ్యకరమైన పనులు చేయడం, దూషించడం.

సెక్షన్ 115(2): ఉద్దేశపూర్వకంగా గాయపరచడం/దాడి చేయడం.

సెక్షన్ 3(5): ఉమ్మడి నేరపూరిత బాధ్యత (ఒకే ఉద్దేశంతో అంతకంటే ఎక్కువ మంది కలిసి నేరానికి పాల్పడటం).

ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఫినిషర్‌గా శశాంక్ సింగ్ ప్రదర్శనలపై విమర్శలు వస్తున్న తరుణంలో, మైదానం బయట ఇలాంటి సీరియస్ క్రిమినల్ కేసు నమోదు కావడం క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై భోపాల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports