IPL 2026: ఇచ్చిపడేస్తారనుకుంటే ఇలా చేశారేంటి బ్రో.. చిత్తు చిత్తుగా ఓడిన SRH | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐపీఎల్ 2026లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ 168 పరుగులు చేసి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 86కి ఆల్ అవుట్ చేసి 82 పరుగుల తేడాతో గెలిచింది

News18
News18

ఇండియన్ ప్రిమియర్ లీగ్ 19వ సీజన్ (IPL 2026)లో భాగంగా జరిగిన 56వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగా, లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు కనీస పోరాటపటిమ చూపలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్న తరుణంలో గుజరాత్ బ్యాటర్లు సంయమనంతో ఆడి జట్టుకు మంచి స్కోరును అందించారు. 169 పరుగుల లక్ష్యం టీ20ల్లో పెద్ద కష్టమేమీ కాకపోయినప్పటికీ, గుజరాత్ బౌలర్లు దానిని అసాధ్యమైన లక్ష్యంగా మార్చేశారు.

పేకమేడలా కుప్పకూలిన హైదరాబాద్ బ్యాటింగ్

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే తడబడింది. గుజరాత్ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో ఆరెంజ్ ఆర్మీ వెన్నెముక విరిగింది. స్టార్ ఓపెనర్లు విఫలం కావడంతో పాటు, మధ్య ఓవర్లలో ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ కేవలం 14.5 ఓవర్లలోనే 86 పరుగుల స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయ్యింది.

రికార్డులు తిరగరాసిన గుజరాత్ టైటాన్స్

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ తమ ఐపీఎల్ ప్రయాణంలో ఒక మైలురాయిని అధిగమించింది. గతంలో రాజస్థాన్ రాయల్స్‌పై సాధించిన 77 పరుగుల విజయమే ఇప్పటివరకు వారి అతిపెద్ద రికార్డుగా ఉండగా, ఇప్పుడు 82 పరుగుల తేడాతో గెలవడం ద్వారా ఆ రికార్డును సవరించింది. అటు సన్‌రైజర్స్‌కు ఇది పరుగుల పరంగా అత్యంత అవమానకరమైన ఓటమిగా మిగిలిపోయింది.

లీగ్ దశ చివరికి చేరుకుంటున్న వేళ ఈ భారీ ఓటమి సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసింది. కేవలం పాయింట్లు కోల్పోవడమే కాకుండా, 82 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల జట్టు ‘నెట్ రన్ రేట్’ (NRR) దారుణంగా పడిపోయింది. మరోవైపు, ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి మరింత చేరువయ్యింది. రాబోయే మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ పుంజుకోకపోతే ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports