IPL 2026: కుల్దీప్ యాదవ్ పరువు తీసిన అక్షర్ పటేల్.. అంతమాట అన్నావేంది సామీ! | క్రీడా వార్తలు | ACTPnews

కుల్దీప్ యాదవ్


Last Updated:

“తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ ఆడుతున్న తీరును బట్టి 155 మంచి స్కోరు అనిపించింది. కానీ మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నందున, మరో 10-15 పరుగులు తక్కువయ్యాయని నేను భావిస్తున్నాను” అని అక్షర్ పేర్కొన్నారు.

కుల్దీప్ యాదవ్
కుల్దీప్ యాదవ్

IPL 2026: తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ అనంతరం రవిశాస్త్రితో మాట్లాడిన కెప్టెన్ అక్షర్ పటేల్, తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డారు. “తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ ఆడుతున్న తీరును బట్టి 155 మంచి స్కోరు అనిపించింది. కానీ మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నందున, మరో 10-15 పరుగులు తక్కువయ్యాయని నేను భావిస్తున్నాను” అని అక్షర్ పేర్కొన్నారు.

పిచ్ తీరు – కొత్త బ్యాటర్లకు సవాల్

అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ కొత్తగా వచ్చే బ్యాటర్లకు కఠినంగా ఉందని అక్షర్ వివరించారు. “కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ఇక్కడ సెటిల్ అవ్వడం అంత సులభం కాదు. బంతి కొన్నిసార్లు ఆగి రావడం, కొన్నిసార్లు తక్కువ ఎత్తులో రావడం వంటివి బ్యాటింగ్‌ను ఇబ్బంది పెట్టాయి. అయితే క్రీజులో సెటిల్ అయిన బ్యాటర్లకు మాత్రం పరుగులు చేయడం సులభమైంది” అని ఆయన విశ్లేషించారు. దీనికి ఉదాహరణగా సీఎస్‌కే ఓపెనర్ సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్‌ను (52 బంతుల్లో 87 నాటౌట్) అక్షర్ గుర్తు చేశారు. ఒక సెట్ బ్యాటర్ మ్యాచ్‌ను ఎలా మలుపు తిప్పగలడో శాంసన్ నిరూపించాడని కొనియాడారు.

స్పిన్ విభాగంలో తేడా

ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర కీలకంగా మారింది. చెన్నై స్పిన్ ద్వయం అకీల్ హొసేన్ మరియు నూర్ అహ్మద్‌లు 7 ఓవర్లలో కేవలం 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీని కట్టడి చేశారు. ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే, అక్షర్ తన 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసినప్పటికీ, తన బౌలింగ్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ నుండి ఆశించిన మద్దతు లభించలేదని అక్షర్ అంగీకరించారు. కుల్దీప్ తన 3 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు.

సానుకూల అంశాలు

ఓటమి ఎదురైనప్పటికీ కొన్ని సానుకూల అంశాలను అక్షర్ ప్రస్తావించారు. “మొదటి 11 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ, చివర్లో ఇన్నింగ్స్‌ను ముగించిన తీరు బాగుంది. అది ఖచ్చితంగా మాకు ఒక సానుకూల అంశం. అయితే బౌలింగ్‌లో కుల్దీప్ తోడ్పాటును నేను మిస్ అయ్యాను” అని అక్షర్ పటేల్ తన నిరాశను వ్యక్తపరిచారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *