IPL Mumbai Indians: దండం దొరా.. ముంబై ఇండియన్స్‌ని వీడనున్న హార్ధిక్ పాండ్యా | క్రీడా వార్తలు | ACTPnews

ముంబై ఇండియన్స్‌ని వీడనున్న హార్ధిక్ పాండ్యా (Image - x - @hardikpandya7)


Last Updated:

IPL Mumbai Indians: హార్ధిక్ పాండ్యా తన ఫామ్‌ను కోల్పోయిన విషయం కూడా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఆల్ రౌండర్‌గా రాణించిన అతడు ప్రస్తుతం బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు.

ముంబై ఇండియన్స్‌ని వీడనున్న హార్ధిక్ పాండ్యా (Image - x - @hardikpandya7)
ముంబై ఇండియన్స్‌ని వీడనున్న హార్ధిక్ పాండ్యా (Image – x – @hardikpandya7)

కెప్టెన్‌గా, ప్లేయర్‌గా దారుణంగా విఫలమైన హార్ధిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌ని వీడనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ అన్ని రకాలుగా ఫెయిలైంది. దాంతో కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదివరకు ఈ టీమ్ ఎంతో బాగా ఆడేది.. అలాంటిది ఇలా పూర్ పెర్ఫార్మె్న్స్ చెయ్యడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హార్ధిక్ పాండ్యా.. టీమ్‌ని వీడబోతున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ముంబై ఇండియన్స్ అంటే.. కచ్చితంగా కప్పు తెచ్చే టీమ్ అనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఈ టీమ్ ఆ జోరు చూపించట్లేదు. ఇక తాజా సీజన్‌లో మిగతా జట్లు దుమ్మురేపగా.. ముంబై ఇండియన్స్ బాబోయ్ అనిపించేలా పేలవమైన ఆటతీరును చూపించింది. అందుకే.. ఫ్యాన్సే.. హార్ధిక్ పాండ్యాను టార్గెట్ చేసి.. వెళ్లిపో అని కోరే పరిస్థితి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి: AP Intermediate Reopening Extension: ఏపీ ఇంటర్ విద్యార్థులకు భారీ శుభవార్త.. సెలవులు పొడిగింపు

ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్ధిక్ పాండ్యా ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబైకి తీసుకురావడంతోనే టీమ్ లోపల ఆందోళనలు మొదలయ్యాయనీ, రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్ధిక్‌ను బాధ్యతలు అప్పగించడం తప్పు అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చాలా దిగువన ఉండటం, బ్యాటింగ్, బౌలింగ్ రెండూ సమన్వయం లేకపోవడం హార్ధిక్ నాయకత్వ వైఫల్యంగా చూస్తున్నారు.

హార్ధిక్ పాండ్యా తన ఫామ్‌ను కోల్పోయిన విషయం కూడా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఆల్ రౌండర్‌గా రాణించిన అతడు ప్రస్తుతం బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ముంబైని వీడి మరో ఫ్రాంచైజీకి మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లఖ్నౌ సూపర్ జెయింట్స్ లేదా రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు హార్ధిక్ కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: Southwest Monsoon Forecast 2026: పిడుగులా ఎల్‌నినో.. ఈ సంవత్సరం వర్షాలపై వాతావరణ శాఖ షాకింగ్ వార్నింగ్!

ఈ పరిణామాలు ముంబై ఇండియన్స్ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపనున్నాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా టీమ్‌లో మార్పులు కోరుతున్నారనీ, తదుపరి సీజన్ నుంచి కొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్ధిక్ వెళ్లిపోతే టీమ్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడనుంది.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *