Last Updated:
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. గత నాలుగేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ను కాస్త పక్కనపెట్టి, సరికొత్త ప్రయోగానికి రవితేజ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.














