Konda Surekha: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటుకు వేళాయే.. టీపీసీసీకి చేరిన నివేదిక | తెలంగాణ వార్తలు | ACTPnews

Konda Surekha


Last Updated:

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో భారీ బ్రేకింగ్ న్యూస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పార్టీ విధి విధానాలు, అగ్రనేతల తీరుపై అసంతృప్తిని బహిరంగ వేదికలపై.. వ్యక్తపరుస్తూ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్న నేతలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోబోతోంది.

Konda Surekha
Konda Surekha

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో భారీ బ్రేకింగ్ న్యూస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పార్టీ విధి విధానాలు, అగ్రనేతల తీరుపై అసంతృప్తిని బహిరంగ వేదికలపై.. వ్యక్తపరుస్తూ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్న నేతలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోబోతోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్‌గా చిన్నారెడ్డిని ఊపేక్షించడానికి వీల్లేదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికలో పొందుపర్చడమైనది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ప్రకారం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని..చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ పదవి నుండి తప్పించాలని పేర్కొంది. వీళ్లిద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొంది. దీనిపై చర్చించేందుకు.. తదుపరి చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి రేవంత్ రెడ్డిని కలిసి తుదినిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్సుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed