Last Updated:
ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇరుముడి ఇరుముడి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన విభిన్న కథా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా సరికొత్త మైలురాయిని నెలకొల్పింది.














