Last Updated:
ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తున్న ఇరుముడి బజ్ ఇప్పుడు ఓటీటీలో నెలకొనబోతోంది. ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ కీలక సమాచారం అయితే బయటకొచ్చింది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఇరుముడి’ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎలాంటి టికెట్ల ధరల పెంపు లేకుండానే కేవలం సాధారణ ధరలతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘ఇరుముడి’ మరోసారి నిరూపించింది.














