Irumudi Success Celebrations: ఒక నటుడిగా నా కడుపు నిండిపోయింది.. రవితేజ ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఒక నటుడిగా తనకు పూర్తి స్థాయి సంతృప్తిని, అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచిపోయిందని అని చెబుతూ రవితేజ ఎమోషనల్ అయ్యారు. తాజాగా జరిగిన ఇరుముడి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఈ కామెంట్స్ చేశారు.

News18
News18

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అయితే కమర్షియల్ హంగులతో పాటు, ఒక నటుడిగా ఆయనకు పూర్తి స్థాయి సంతృప్తిని, అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచిపోయిందని ఆయన ఉద్వేగంగా పంచుకున్నారు. సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో, రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. బేబీ నక్షత్ర, డైలాగ్ కింగ్ సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports