Isakapatnam Review: శోభనం రాత్రి ఊహించని ట్విస్ట్, మైండ్ గేమ్‌తో దెబ్బకొట్టే సీన్లు.. ఐశ్వర్య రాజేష్ ఇసకపట్నం మూవీ మామూలుగా లేదబ్బా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆధిపత్య రాజకీయాలు, పల్లెటూరి నేపథ్యంతో వచ్చే వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో విపరీతమైన ఆదరణ దక్కుతోంది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తీసుకొని రూపొందించిన సినిమా ఇసకపట్నం. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..

News18
News18

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక తెలుగు ప్రేక్షకులకు రా అండ్ రస్టిక్ కంటెంట్‌పై ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా ఆధిపత్య రాజకీయాలు, పల్లెటూరి నేపథ్యంతో వచ్చే వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో, తమడా మీడియా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సునీల్, రాజీవ్ కనకాల, సుధాకర్ కోమాకుల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

ఈ సిరీస్ కథ 1980ల నాటి తీరప్రాంత గ్రామమైన ఇసుకపట్నంలో సాగుతుంది. ఆ ప్రాంతంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న నాయకుడు చిన్నారావు దగ్గరే పొట్టకూటి కోసం వచ్చిన నాయుడు పనికి చేరతాడు. అయితే, క్రమంగా ఎదిగిన నాయుడు గంగమ్మ జాతర సాక్షిగా చిన్నారావునే మట్టుబెట్టి, ఇసుకపట్నానికి ఏకైక మాఫియా డాన్‌గా మారుతాడు. కానీ, నాయుడు సాగిస్తున్న ఈ నెత్తుటి రాజకీయాలు నచ్చని అతడి కూతురు భారతి తండ్రికి ఎదురుతిరిగి ప్రజాసేవలో మునిగిపోతుంది. ఈ క్రమంలో భారతి పెళ్లాడిన భర్త ప్రతాప్ వర్మ తొలిరాత్రే దారుణ హత్యకు గురవుతాడు. ఇసుకపట్నాన్ని నాయుడు తన సామ్రాజ్యంగా ఎలా మార్చుకున్నాడు, ఈ మాఫియాను అడ్డుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వర్మ వేసిన ఎత్తుగడలేంటి, ఈ క్రైమ్ సిండికేట్ చివరకు ఎలా అంతమైంది అనేది ఈ సిరీస్ ప్రధాన కథ.

వలస కార్మికులు, మాఫియా ఆధిపత్యం అనే కథాంశం పాతదే అయినా.. దర్శకుడు గ్యారీ బీహెచ్ దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరులో స్వచ్ఛమైన మట్టి వాసన కనిపిస్తుంది. తొలి ఎపిసోడ్లు నాయుడు మాఫియా డాన్‌గా ఎదిగిన క్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త నెమ్మదిగా సాగుతాయి. కానీ, ఎప్పుడైతే తండ్రీకూతుళ్ల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు మొదలవుతాయో అక్కడి నుంచి స్క్రీన్‌ప్లే ఒక్కసారిగా ఊపందుకుంటుంది. పారిశ్రామిక ఆధిపత్యం కోసం కుట్రలు, గ్యాంగ్ వార్స్ ఉత్కంఠ రేపుతాయి. సిరీస్ మధ్యలో వచ్చే గ్యాస్ లీకేజీ ప్రమాదం కథను కీలక మలుపు తిప్పుతుంది. ద్వితీయార్థంలో కొన్ని ఎపిసోడ్లు కాస్త సాగదీతగా అనిపించినా, చివరి మూడు ఎపిసోడ్లలో వచ్చే హై-వోల్టేజ్ డ్రామా, క్లైమాక్స్ ట్విస్టులు, మైండ్ గేమ్‌తో దెబ్బకొట్టే సీన్లు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి. కథలో మోతాదు మించి హింసాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఆ రివెంజ్ డ్రామా ఇంటెన్సిటీకి అది అవసరమేననిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. నాయుడు పాత్రలో సముద్రఖని తన మార్క్ విలనిజంతో జీవించేశారు. ఈ సిరీస్‌కు ఆయన నటన అతిపెద్ద బలం కాగా, తండ్రిని ఎదిరించే కూతురు భారతిగా ఐశ్వర్య రాజేశ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా పండింది. పోలీస్ అధికారిగా సునీల్, ఆటో డ్రైవర్‌గా నరేష్ అగస్త్య, కోటయ్యగా బెనర్జీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం తీరప్రాంత రస్టిక్ వాతావరణాన్ని సహజంగా చూపించగా, ప్రవీణ్ లక్కరాజు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తమడా మీడియా నిర్మాణ విలువలు సినిమాను తలపించేలా రిచ్‌గా ఉన్నాయి. కాస్త సాగదీత ఉన్నప్పటికీ, బలమైన భావోద్వేగాలు, ఆసక్తికరమైన రాజకీయ ఎత్తుగడలతో సాగే ‘ఇసకపట్నం’ ప్రేక్షకులను మెప్పించే ఒక ఇంటెన్స్ ఫాదర్-డాటర్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.

రేటింగ్: 3

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *