Isakapatnam Trailer: కుర్చీ కోసం తండ్రితోనే పోరాటం.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఇసకపట్నం ట్రైలర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సముద్రకని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా ఇసకపట్నం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

News18
News18

ప్రైమ్ వీడియో తమ కొత్త తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసకపట్నం ట్రైలర్‌ విడుదల చేసింది. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ సిరీస్‌లో సముద్రఖని నాయుడు పాత్రలో, ఐశ్వర్య రాజేష్ భారతి పాత్రలో నటించారు. పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ 7 ఎపిసోడ్‌ల సిరీస్‌కు ప్రశాంత్ రాఘతి కథ అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports