IShowSpeed: క్రికెట్ మైదానంలో ఐషోస్పీడ్ హల్చల్.. విరాట్ కోహ్లీకి సవాల్ విసిరిన అమెరికన్ యూట్యూబర్! | క్రీడా వార్తలు | ACTPnews

ఐ షో స్పీడ్, కోహ్లీ


Last Updated:

అయితే అతను బౌలింగ్ చేసిన తీరు చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఒక ప్రొఫెషనల్ బౌలర్ లాగా కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా బంతిని విసిరి వికెట్లను గిరాటేసిన స్పీడ్, వెంటనే గట్టిగా అరుస్తూ అప్పీల్ చేశాడు.

ఐ షో స్పీడ్, కోహ్లీ
ఐ షో స్పీడ్, కోహ్లీ

IShowSpeed: ప్రసిద్ధ అమెరికన్ స్ట్రీమర్ ‘ఐషోస్పీడ్’ (IShowSpeed) ఎక్కడుంటే అక్కడ సందడి, హంగామా మామూలే. తనదైన శైలిలో అల్లరి చేస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యూట్యూబర్, తాజాగా వెస్టిండీస్‌లోని ఆంటిగ్వాలో అడుగుపెట్టి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశాడు. సర్ వివియన్ రిచర్డ్స్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ స్టార్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌తో కలిసి స్పీడ్ చేసిన క్రికెట్ విన్యాసాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

దాదాపు 5.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఈ స్టార్ స్ట్రీమర్, ఆంటిగ్వా అండ్ బార్బుడా జెర్సీ ధరించి మైదానంలోకి దిగాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి నిశితంగా గమనించిన స్పీడ్, ఆ తర్వాత తానే బౌలింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే అతను బౌలింగ్ చేసిన తీరు చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఒక ప్రొఫెషనల్ బౌలర్ లాగా కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా బంతిని విసిరి వికెట్లను గిరాటేసిన స్పీడ్, వెంటనే గట్టిగా అరుస్తూ అప్పీల్ చేశాడు.

విరాట్ కోహ్లీ నాకు ఫోన్ చేయాలి!

బౌలింగ్ చేసిన అనంతరం స్పీడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని ఉద్దేశించి అతను చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. “నేనే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ని కావచ్చు. విరాట్ కోహ్లీ.. నాకు కాల్ చెయ్. ఐసీసీ (ICC) నాకు ఫోన్ చేయాలి, ముంబై క్రికెట్ టీమ్ నాకు కాల్ చేయాలి” అంటూ కేకలు వేశాడు. “విరాట్.. బ్రో, నువ్వు నాకు కచ్చితంగా కాల్ చేయాల్సిందే” అంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు.

క్రికెట్‌తో విడదీయలేని బంధం..

అమెరికాలో క్రికెట్ అంతగా ప్రాచుర్యం పొందిన క్రీడ కాకపోయినప్పటికీ, గత కొంతకాలంగా స్పీడ్ ఈ ఆటతో వింతైన సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. ఈ కరేబియన్ టూర్‌లో అంతకుముందు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ బౌలింగ్‌లోనూ స్పీడ్ బ్యాటింగ్ చేశాడు. ఒక బంతిని క్లీన్‌గా హిట్ చేసిన అతను, ఆ తర్వాత ఔట్ అయ్యాడు. అప్పుడు కూడా “నన్ను అందరూ విరాట్ కోహ్లీ అని పిలుస్తారు” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు కూడా స్పీడ్ హాజరయ్యాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో భారత అభిమానుల మాదిరిగానే ఎంతో ఉద్వేగంతో కోహ్లీని సపోర్ట్ చేస్తూ కనిపించాడు. కోహ్లీ అవుట్ అయినప్పుడు బాధపడటం, సిక్సర్లు కొట్టినప్పుడు చిందులేయడం చూస్తుంటే అతనికి క్రికెట్ పట్ల, ముఖ్యంగా కోహ్లీ పట్ల ఉన్న అభిమానం అర్థమవుతుంది.

రొనాల్డో, కోహ్లీలే నా హీరోలు..

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంటే స్పీడ్‌కు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో అతను రొనాల్డోను, కోహ్లీని పోలుస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్ల మానసిక దృఢత్వం (Mentality), వారి స్టార్ పవర్ ఒకేలా ఉంటాయని స్పీడ్ తరచుగా చెబుతుంటాడు. మొత్తానికి, తన అల్లరితో ఆంటిగ్వా స్టేడియాన్ని ఒక ఊపు ఊపేసిన ఐషోస్పీడ్, క్రికెట్ ప్రపంచంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. విరాట్ కోహ్లీ ఈ వీడియోపై ఎలా స్పందిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed