Last Updated:
ISS wishes: ఇటీవల ఇండియా.. క్రమంగా రష్యాకి దూరమవుతూ.. అమెరికాకి దగ్గరవుతూ ఉంది. కానీ ఇండియాకి మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండుగా ఉన్న దేశం రష్యా. ఆపరేషన్ సిందూర్‌లో కూడా రష్యా మిస్సైల్ డిఫెన్స్ సిస్టమే.. ఇండియాని కాపాడింది. ఇప్పుడు ఈ సందేశం ద్వారా.. రష్యా స్నేహం గొప్పదనాన్ని కాస్మోనాట్లు చాటారు.
భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంగా, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ (ISS)లో ఉన్న రష్యా కాస్మోనాట్లు ప్రత్యేకమైన శుభాకాంక్షలు పంపారు. వీడియో సందేశంలో వారు భారత జాతీయ పతాకం తిరంగాను చేతిలో పట్టుకుని, భారత్-రష్యా మధ్య చిరకాల స్నేహాన్ని ప్రస్తావిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందేశాన్ని డీడీ న్యూస్ అధికారిక ఖాతా ద్వారా పంచుకుంది.














