Last Updated:
IT Rules amendment: ఈ కొత్త నిబంధనల్లో మరిన్ని మార్పులు ఉన్నాయి. సాధారణ ఫిర్యాదుల పరిష్కార గడువు 72 గంటల నుంచి 36 గంటలకు, నగ్నత్వం లేదా ఇంపర్సనేషన్ వంటి సున్నితమైన విషయాల్లో 24 గంటల నుంచి 2 గంటలకు తగ్గించారు.
భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కఠిన నిబంధనలు విధిస్తూ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్‌లో ఫిబ్రవరి 2026లో చేసిన సవరణల ప్రకారం, ప్రభుత్వం లేదా కోర్టు నుంచి చెల్లుబాటు అయ్యే నోటీసు అందిన తర్వాత అక్రమ కంటెంట్‌ను తొలగించే గడువు 36 గంటల నుంచి కేవలం 3 గంటలకు తగ్గింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) అధికారిక ప్రకటనల ద్వారా మరోసారి స్పష్టం చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టుల ప్రకారం ఈ మార్పు ప్రధానంగా AI ఆధారిత డీప్‌ఫేక్‌లు, సింథటిక్ కంటెంట్, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ వంటి హానికరమైన విషయాలను వేగంగా అరికట్టేందుకు ఉద్దేశించినది.














