Last Updated:
వామ్మో.. ఈ చిన్నారి లక్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! దేవుడి గుడి ముందు అసలేం జరిగింది?
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ చిన్నారి దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. అనుకోకుండా కొన్న ఓ చిన్న లాటరీ టికెట్ ఓ సాధారణ కుటుంబాన్ని రాత్రికి రాత్రే లక్షాధికారులను చేసింది. దమ్దమా సాహిబ్‌లో జరిగిన మీరీ-పీరీ ఖల్సా మార్చ్ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ 11 ఏళ్ల బాలికకు ఏకంగా పది లక్షల రూపాయల లాటరీ తగిలింది. పంజాబ్ రాష్ట్రం మాన్సా జిల్లా బహణీవాల్ గ్రామానికి చెందిన హర్జోత్ కౌర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తఖ్త్ శ్రీ దమ్దమా సాహిబ్ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి ఈ అదృష్టాన్ని సొంతం చేసుకుంది.













