Last Updated:
విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా నేడే (జూలై 23) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పబ్లిక్ ఏమంటున్నారు? అనేది చూద్దామా..
విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా నేడే (జూలై 23) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ నటించిన తొలి చిత్రం, ఆయన సినీ కెరీర్లో చివరి చిత్రం కావడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది.
తమిళనాడు వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో ఈరోజు ఉదయం 9 గంటలకు ‘జననాయకన్’ విడుదలైంది. ఈ సందర్భంగా చెన్నైలోని థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. కేరళలో ఉదయం 6 గంటలకు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో కూడా ఉదయం 6 గంటలకే షో వేశారు. అక్కడ, జన నాయగన్ వాలంటీర్లు విజయ్ కటౌట్‌పై పాలు పోసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తమిళ ప్రాబల్య ప్రాంతాలలో జన నాయగన్ తమిళంలో విడుదల కాగా, ఇతర ప్రాంతాలలో తెలుగులో విడుదలైంది. చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ఈ చిత్రాన్ని వీక్షించడానికి వెళ్తుండటంతో, పలు చోట్ల భద్రతా సిబ్బందితో పాటు బౌన్సర్లు కూడా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది విజయ్ వన్ మ్యాన్ షో అని, సినిమాలోని ఒక్కో సన్నివేశం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని, ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ సూపర్బ్ అంటూ పబ్లిక్ పలు సామజిక మాధ్యమాల్లో పేర్కొంటున్నారు. ఏపీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. థియేటర్స్ వద్ద విజయ్ అభిమానుల కోలాహలం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.
తవేకా ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్, ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్ రోహిణి సినిమా థియేటర్లో ఈ చిత్రాన్ని చూశారు. అన్నా నగర్ ఎమ్మెల్యే రామ్‌కుమార్ తదితరులు కూడా సినిమా చూశారు. మంత్రి అరుణ్ రాజ్ మాట్లాడుతూ, “సినిమా ఆన్లైన్లో లీక్ అయినప్పటికీ, జన నాయగన్ ను చూడటానికి ఇంత మంది వచ్చారు. ఈ ప్రేమకు ధన్యవాదాలు. ఇది చాలా భావోద్వేగభరితంగా ఉంది. నేను కూడా ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నటించాను. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను” అన్నారు.
ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా ఒక్క భారతదేశంలోనే రూ. 15 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. గతంలో రజనీకాంత్ ‘కూలీ’ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. అది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్నప్పటికీ, ‘జననాయకన్’ డిమాండ్ తో దానిని అధిగమించగలదా అనే చర్చ జనాల్లో నడుస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 23, 2026 11:01 AM IST














