Last Updated:
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకన్’ (Jana Nayagan) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకన్’ (Jana Nayagan) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సెన్సార్ బోర్డు వివాదాలు, న్యాయపోరాటాలు, ఆన్లైన్ లీకేజీల వంటి ఎన్నో తీవ్రమైన అడ్డంకులను దాటుకుంటూ ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని 2026 జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న విజయ్ పవర్ఫుల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. H. వినోద్ దర్శకత్వంలో రూ. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.
నిజానికి జనవరి 9నే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ, సెన్సార్ సమస్యలతో వాయిదా పడి, ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. ఇది విజయ్ లాస్ట్ సినిమా కావడంతో ఆయన అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూశారు. తాజాగా అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సినిమా విడుదల తేదీ ప్రకటించారు.
ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనప్పటికీ, కెనడాలోని ప్రముఖ థియేటర్ చైన్ ‘యార్క్ సినిమాస్’ (York Cinemas) విజయ్ అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఉండవని, టికెట్లు కేవలం థియేటర్ బాక్సాఫీస్ కౌంటర్ వద్ద మాత్రమే నేరుగా విక్రయిస్తామని ప్రకటించింది.
గతంలో సెన్సార్ బోర్డు (CBFC)తో ఏడు నెలల పాటు సాగిన వివాదం, మద్రాస్ హైకోర్టులో నడిచిన న్యాయపోరాటం కారణంగా జన నాయకన్ అడ్వాన్స్ బుకింగ్స్ రద్దు చేయాల్సి వచ్చింది. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ జేన్యుయిన్ ఫ్యాన్స్‌కు న్యాయం చేయడానికే ఈ ఆఫ్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ రూల్ కేవలం కెనడాలోని యార్క్ సినిమాస్‌కు మాత్రమే వర్తిస్తుందని, మిగతా ప్రపంచవ్యాప్త మార్కెట్లలో ఎప్పటిలాగే సాధారణ డిజిటల్, ఆన్లైన్ బుకింగ్స్ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
సినిమా కెరీర్‌కు స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీఎం విజయ్ కెరీర్లో 68వ చిత్రంగా వస్తున్న ఈ లాస్ట్ మూవీపై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎలా ఉండబోతుందోనని సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














