Last Updated:
JanaSena Party Controversy: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్షవీణ అనే యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడని స్వయంగా బాధితురాలే మీడియా, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి జనసేన పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. దీనికి తోడు కొద్ది రోజుల క్రితమే జనసేన నాయకుడు, అరవ శ్రీధర్ అనుచరులు కలిసి ఓ యువతిని ఆమె తరపు లాయర్‌ని నడిరోడ్డుపై చితకబాదారు. ఇది మర్చిపోక ముందే మరో జనసేన నేతపై లైంగిక ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
JanaSena Party Controversy: ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలమైన స్థానిక పార్టీగా జనసేన ఆవిర్భవించింది. కూటమి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చరిష్మా ప్రజల్లో పెరుగుతుంటే.. ఆపార్టీ నుంచి గెలిచిన నేతలు, నాయకులపై మాత్రం లైంగిక వేధింపుల ఆరోపణలు, విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంతుంది..? పార్టీ చీఫ్ వీటీని ఖండించకపోవడం వల్లే జనసేన పార్టీ నేతలపై విమర్శలు పెరుగుతున్నాయా అనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్షవీణ అనే యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడని స్వయంగా బాధితురాలే మీడియా, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి జనసేన పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. దీనికి తోడు కొద్ది రోజుల క్రితమే జనసేన నాయకుడు, అరవ శ్రీధర్ అనుచరులు కలిసి ఓ యువతిని ఆమె తరపు లాయర్‌ని నడిరోడ్డుపై చితకబాదారు. ఇది మర్చిపోక ముందే మరో జనసేన నేతపై లైంగిక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ZPTC జయప్రకాశ్ నాయుడు తనను శారీరకంగా వాడుకోవడమే కాకుండా డబ్బు, నగలు తీసుకున్నాడని ఓ మహిళ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు జనసేన నేతలపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు వాస్తవమా..? లేక వ్యూహంలో భాగమా..? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా మారిన తర్వాత ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్నీ స్థానాల్లో విజయం సాధించిన పవన్ కల్యాణ్ జనసైనికులు.. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో అనేక విమర్శలతో నిత్యం వివాదాల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ యువతిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు సేనానికి తలనొప్పిగా మారితే ..ఇప్పుడు మరో నాయకుడు అదే విధంగా ప్రవర్తించాడని ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం పొలిటికల్ సర్కిల్‌లో రచ్చ రచ్చ అవుతోంది.
మరో జనసేన నేతపై లైంగిక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ZPTC జయప్రకాశ్ నాయుడు తనను శారీరకంగా వాడుకోవడమే కాకుండా డబ్బు, నగలు తీసుకున్నాడని ఓ మహిళ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.#janasena #apnews pic.twitter.com/HbGmWXI0MZ
— News18 Telugu (@News18Telugu) April 9, 2026
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ZPTCగా ఉన్న జయప్రకాశ్ నాయుడుపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో జనసేన పార్టీలో యాక్టివ్‌గా పని చేస్తున్న జయప్రకాశ్ నాయుడు తనను శారీరకంగా తనను వాడుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా మోసం చేశాడని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్(ట్విట్టర్)లో వైరల్ అవుతోంది.
పెళ్లి చేసుకుంటానని తనను లోబర్చుకోవడమే కాకుండా తన తల్లికి అనారోగ్యంగా ఉంటే వైద్యం చేయిస్తానని ఇంట్లోని డబ్బు, నగలు కూడా తీసుకున్నారని ఇదేంటని అడిగితే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. జయప్రకాశ్ నాయుడుతో తాను దిగిన ఫోటోలు, వీడియో ఆధారాలు కూడా తన దగ్గరున్నాయని బాధితురాలు వీడియోలో చెప్పడంతో ఈవార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
West Godavari,Andhra Pradesh
Apr 09, 2026 11:04 AM IST













