Last Updated:
Javagal Srinath: భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ప్రముఖ సెలబ్రిటీ అయినప్పటికీ ఎలాంటి హంగులూ, ఆర్భాటాలు లేకుండా ఆయన సాధారణ ప్రయాణికుడిలా మెట్రో రైల్లో ప్రయాణించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రైవేట్ వాహనాల్లో కాకుండా మెట్రో రైలులో ప్రయాణాన్ని ఎంచుకున్న శ్రీనాథ్ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా మొదటిసారి షేర్ చేసిన ఈ ఫొటోకు వేల సంఖ్యలో లైకులు, ప్రశంసల వర్షం కురుస్తున్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.














