Last Updated:
లక్షలాది మంది విద్యార్థుల డేటా చోరీకి గురైందనే వార్తలు కేవలం “అసత్యాలు మరియు తప్పుదోవ పట్టించేవి” అని కొట్టిపారేసింది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
JEE Advance: జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2026 అభ్యర్థుల సమాచారం పెద్ద ఎత్తున లీక్ అయిందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఐఐటీ రూర్కీ (IIT Roorkee) స్పష్టం చేసింది. లక్షలాది మంది విద్యార్థుల డేటా చోరీకి గురైందనే వార్తలు కేవలం “అసత్యాలు మరియు తప్పుదోవ పట్టించేవి” అని కొట్టిపారేసింది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి, జూన్ 2, 2026న అత్యవసర ప్రాతిపదికన కొన్ని “సాంకేతిక మార్పులు” (Technical Interventions) చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్‌లో ఒక చిన్న, తాత్కాలిక లోపం ఏర్పడిందని పేర్కొంది.
దుబాయ్‌కి చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాయ్‌లెన్ అనిల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (గతంలో ట్విట్టర్) ద్వారా దీనిపై స్పందిస్తూ.. క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపం కారణంగా అభ్యర్థుల డేటా ఆన్‌లైన్‌లో ఎవరికైనా కనిపించేలా బహిర్గతమైందని ఆరోపించారు. దాదాపు 1.79 లక్షల ఫలితాల రికార్డులు, 1.87 లక్షల అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్‌లు (PDFs) యాక్సెస్ చేసుకునేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Claims of a data breach and privacy violation affecting lakhs of JEE (Advanced) aspirants are misleading and factually incorrect.
The information circulating on social media is misleading and does not accurately reflect what happened. There is an attempt at spreading…
— IIT Roorkee (@iitroorkee) June 5, 2026
ఈ ఆరోపణలపై ఐఐటీ రూర్కీ స్పందిస్తూ.. సదరు ఎథికల్ హ్యాకర్ (రాయ్‌లెన్ అనిల్) ఈ లోపాన్ని గుర్తించి తమకు నివేదించిన వెంటనే అప్రమత్తమయ్యామని తెలిపింది. ఆ సమస్యను తక్షణమే సరిదిద్ది, డేటాకు వేరెవరూ యాక్సెస్ చేసుకోకుండా నిరోధించామని పేర్కొంది.
ప్రభావితమైన సదరు క్లౌడ్ స్టోరేజ్ కేవలం ‘రీడ్-ఓన్లీ’ (Read-only) మోడ్‌లో మాత్రమే ఉందని, మొత్తం డేటాలో కేవలం 0.05 శాతం కంటే తక్కువ సమాచారానికి మాత్రమే చాలా పరిమితంగా యాక్సెస్ లభించిందని స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధించిన ఎలాంటి సున్నితమైన సమాచారం (Sensitive Data) దుర్వినియోగం కాలేదని, డేటాను పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ (Mass extraction) చేయడం జరగలేదని ఐఐటీ రూర్కీ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













