మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు మార్పు కోరుకుని కేసీఆర్ను గద్దె దించారని, కానీ ఇప్పుడు కేవలం రెండేళ్లలోనే “రేవంత్ రెడ్డి పోవాలి” అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యంగా ప్రాణహిత జలాల వినియోగంపై దృష్టి సారించలేదని విమర్శించారు. మేడిగడ్డ నివేదిక వచ్చినా పునర్నిర్మాణం చేపట్టకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్తుందో అదే పార్టీలో చేరుతానని, వారం పది రోజుల్లో తన నిర్ణయం చెప్తానని వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 13న ఆయన బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
Source link
Jeevan Reddy on Revanth: రేవంత్ని ఓడించే ..పార్టీలోనే చేరుతా..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










