Last Updated:
ఉద్యోగంలో ఉండగా మరణించిన తమ తండ్రుల స్థానంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందడానికి వివాహమైన కుమార్తెలకు కూడా పూర్తి అర్హత ఉందని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కారుణ్య నియామకాల (Compassionate Appointments) విషయంలో కుమారులకు, కుమార్తెలకు మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది.
ఉద్యోగంలో ఉండగా మరణించిన తమ తండ్రుల స్థానంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందడానికి వివాహమైన కుమార్తెలకు కూడా పూర్తి అర్హత ఉందని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కారుణ్య నియామకాల (Compassionate Appointments) విషయంలో కుమారులకు, కుమార్తెలకు మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది. కేవలం వివాహం అయ్యిందన్న ఒకే ఒక్క కారణంతో కుమార్తెల దరఖాస్తులను తిరస్కరించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ.. చనిపోయిన ఇద్దరు బ్యాంక్ ఉద్యోగుల వివాహిత కుమార్తెలకు ఉద్యోగాలు ఇవ్వాలని సంబంధిత బ్యాంకును కోర్టు తాజాగా ఆదేశించింది.














