సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయి పౌరాణిక పాత్రలో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ తరహా పాత్రలకు బాగా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. త్రివిక్రమ్ సృజనాత్మకత, ఎన్టీఆర్ నటన కలిస్తే తెలుగు ప్రేక్షకులకు మరో విజువల్ వండర్ దక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.













