Jr NTR: ‘డ్రాగన్’ సినిమా క్రేజీ అప్‌డేట్.. కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

1967లో పుట్టి ప్రపంచాన్నే కుదిపేసిన ఓపియుమ్ అనే ప్రమాదకరమైన డ్రగ్ వ్యాపారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండుగా చీలీంది. అప్పుడు మొదలైన యుద్దంలో రాక్షస విలన్‌లు పుట్టుకొచ్చారు.

News18
News18

రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ నెక్స్ట్ సినిమా పక్కా ఫ్లాప్ అనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ‘దేవర’తో రూ.500 కోట్లు కొల్లగొట్టిండు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలనుకున్నాడు కానీ.. కథలో కొన్ని మార్పులు, చేర్పులు కోరడంతో కథ పక్కకు జరిగింది. ఈ లోపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నిజానికి వీళ్ల కాంబినేషన్ ఎప్పుడో లాక్ అయిపోయింది. అయితే ‘దేవర-2’ తర్వాత వీళ్ల కాంబో పట్టాలెక్కాల్సి ఉంది.

అనుకోకుండా దేవర సీక్వెల్ ఆగిపోవడం.. అదే టైమ్‌లో ప్రశాంత్ నీల్ సైతం మళ్లీ ఎన్టీఆర్‌ను కలవడంతో డ్రాగన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. మాములుగానే ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌లో ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి ఎప్పుడూ తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని చెప్పుకునే నీల్ మామ ఇప్పుడు ఇంకా ఏ రేంజ్‌లో ఎలివేషన్ సీన్లు రాసుకున్నాడో అని తారక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోసల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ది ఫ్యామిలీ మ్యాన్ హీరో మనోజ్ భాజ్‌పేయిని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ పాత్రకు ఆయన ఓకే అంటే వచ్చే షెడ్యూల్ నుంచే ఆయనపై షూటింగ్ స్టార్ట్ చేస్తారట.

ఇక ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ యావత్ ఇండియానే ఊపేసింది. దాదాపు 4 నిమిషాల 35 సెకండ్ల నిడివితో రిలీజైన గ్లింప్స్‌ ఒక్క తారక్ ఫ్యాన్స్‌నే కాదు.. జనరల్ ఆడియెన్స్‌ను కూడా మెంటలెక్కించింది. ఇప్పటికే ఎన్ని సార్లు ఆ గ్లింప్స్ చూశారో వాళ్లకు కూడా తెలియదు. అంతలా నరనరాల్లో ఎక్కేసింది. ప్రతీ షాట్, ప్రతీ ఫ్రెమ్ అసలు మెంటల్ మాస్ అనేలా ఉంది. ప్రశాంత్ నీల్ ఈ సారి తారక్ ఫ్యాన్స్‌కు మాములు ట్రీట్ ఇవ్వడం లేదు. ఫుల్ మీల్స్ పెడితే చాలు అనుకున్న ఫ్యాన్స్‌కు ఏకంగా కింగ్ సైజ్ ధమ్ బిర్యానీనే వడ్డించేలా ఉన్నాడు. ఈ గ్లింప్స్ చూసిన దగ్గరనుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనసు మనసులో లేదంటే నమ్ము. చెప్పాలంటే ఒక డ్రగ్ లాగా ఎక్కేసింది.

1967లో పుట్టి ప్రపంచాన్నే కుదిపేసిన ఓపియుమ్ అనే ప్రమాదకరమైన డ్రగ్ వ్యాపారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండుగా చీలీంది. అప్పుడు మొదలైన యుద్దంలో రాక్షస విలన్‌లు పుట్టుకొచ్చారు. అందులో నుంచి వచ్చినవాడు లూగర్ అలియాస్ ఎన్టీఆర్. అతనిరాకతో దేశమే వణికిపోయింది. శత్రువులను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్న ఈ డెవిల‌్‌ను పట్టుకోవడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది వచ్చే ఏడాది జూన్ 11న తెలుస్తుంది.

గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు ఫ్యాన్స్ ఆల్రెడీ ప్రశాంత్ నీల్‌కు గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఈ ఒక్క గ్లింప్స్‌తో పీక్స్ వెళ్లిపోయాయి. మరీ ముఖ్యంగా కాస్త సన్నగా కనిపించినా ఎన్టీఆర్ క్యారెక్టర్ తాలుకు ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజ్‌లో చూపించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పేరు లూగర్ అని ఉంది. అసలు లూగర్ అంటే ఏంటీ అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా 3 దేశాలను వణికించిన డ్రగ్ డీలర్ లార్డ్ ఖున్ సా కథ ఆధారంగా తెరకెక్కబోతుదందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో తారక్ తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్-సన్ ఎమోషన్ హైలైట్ కాబోతుందని తెలుస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed