Last Updated:
మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (DRAGON) అఫీషియల్ గ్లింప్స్ యూట్యూబ్‌లో సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 64 మిలియన్లకు పైగా (6.4 కోట్లు) వ్యూస్ సాధించి, భారతీయ చిత్ర పరిశ్రమలోనే “ఇండియాస్ మోస్ట్ వీవ్డ్ మూవీ గ్లింప్స్” గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల విధ్వంసం మొదలైంది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ చిత్రాల సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (DRAGON) అఫీషియల్ గ్లింప్స్ యూట్యూబ్‌లో సునామీ సృష్టిస్తోంది. ‘#NTRNeel’ (NTR 31) అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన గ్లింప్స్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులను లిఖించింది.
ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 64 మిలియన్లకు పైగా (6.4 కోట్లు) వ్యూస్ సాధించి, భారతీయ చిత్ర పరిశ్రమలోనే “ఇండియాస్ మోస్ట్ వీవ్డ్ మూవీ గ్లింప్స్” గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక పవర్ఫుల్ రికార్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ రగ్గడ్ లుక్, బ్లాక్ బనియన్, సన్‌గ్లాసెస్‌తో అల్ట్రా మాస్ అవతారంలో కనిపిస్తూ అభిమానులకి పూనకాలు తెప్పిస్తున్నారు.
1967 బ్యాక్‌డ్రాప్ స్టోరీ: దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని 1967 కాలం నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో, నల్లమందు మాఫియా, గ్లోబల్ వార్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన ‘లుగర్’ అనే అత్యంత క్రూరమైన అసాసిన్ (హంతకుడు) పాత్రలో నటిస్తుండటం విశేషం. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ షేడ్ విజువల్స్, ఎన్టీఆర్ ఊరమాస్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి.ఈ పాన్-ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’ గా నటిస్తుండగా, కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. అలాగే బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక విభాగంలో ‘KGF’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను జూన్ 11, 2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాపై ఉన్న అంచనాలు అయితే మాటల్లో చెప్పలేం.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 21, 2026 10:19 AM IST

















