సీనియర్ ఎన్టీఆర్, జయలలిత జాతకాలతో పోలిక: భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు సినీ గ్లామర్ నుండి వచ్చి ముఖ్యమంత్రులుగా అఖండ విజయం సాధించిన నటులు ముగ్గురే ఉన్నారని వేణు స్వామి గుర్తు చేశారు. వారు: ఎం.జి. రామచంద్రన్ (MGR), నందమూరి తారక రామారావు (Senior NTR), మరియు జె. జయలలిత. ఈ ముగ్గురి తర్వాత ఆ స్థాయి పొలిటికల్ పవర్ సాధించబోయే ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జాతకం దివంగత సీఎం జయలలిత, ఆయన తాతగారైన పెద్ద ఎన్టీఆర్ జాతకాలతో చాలా దగ్గరి పోలికలను కలిగి ఉందని, ఆయన జాతకంలోని ‘సింహ రాశి’ ప్రభావం వల్ల ఊహించని విధంగా ‘రాజయోగం’ పడుతుందని వివరించారు.













