Last Updated:
Kalvakuntla Kavitha: పాదయాత్ర చేసిన వాళ్లు సీఎం అవుతారనే సెంటిమెంట్ ఉండేది. ఆ తర్వాత జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు ముఖ్యమంత్రులు అవుతారనే నానుడి నేతల్లో నాటుకుపోయింది. తాజాగా ప్రదేశానికి(బహిరంగ సభ వేదిక)కూడా సీఎం అయ్యేందుకు సెంటిమెంట్‌గా మారుతుందంటే నమ్మక తప్పదు.
Kalvakuntla Kavitha: రాజకీయాల్లో ఎవరి అంచనాలు వాళ్లవి. ఎవరి సెంటిమెంట్ వాళ్లది. సీఎం పదవి కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని సందర్భాలు ఇతరులకు కలిసి వచ్చిన అంశాలే మనకు కలిసి వస్తాయని భావిస్తుంటారు. ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్తేమి కాదు గత దశాబ్ధన్నర కాలం నుంచి ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ సక్సెస్ ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన వాళ్లు సీఎం అవుతారనే సెంటిమెంట్ ఉండేది. ఆ తర్వాత జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు ముఖ్యమంత్రులు అవుతారనే నానుడి నేతల్లో నాటుకుపోయింది. తాజాగా ప్రదేశానికి(బహిరంగ సభ వేదిక)కూడా సీఎం అయ్యేందుకు సెంటిమెంట్‌గా మారుతుందంటే నమ్మక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పే ఓల్డ్ స్ట్రాటజీ చూస్తే ఆమె ఆలోచన, అడుగుల వెనుక ఇంత స్కెచ్ ఉందా డౌట్స్ రాజకీయ నేతలకే కాదు..సామాన్య ప్రజలను కూడా ఆలోచించేలా చేస్తోంది. ఏ సెంటిమెంట్‌తో తాను కూడా తెలంగాణకు సీఎం అవుతానని స్పష్టం చేశారో తెలిసి అంతా అవాక్కవుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో పార్టీల స్ట్రాటజీ కంటే వ్యక్తుల ప్రెడిక్షన్ కొత్తగా ఉంటోంది. ప్రజల్లో కాస్తో కూస్తో పాపులారిటీ రాగానే వెంటనే రాజకీయ భిక్షపెట్టిన పార్టీని వదిలి సొంతగా కొత్త పార్టీ పెట్టుకోవడం.. ముఖ్యమంత్రి కావాలని ఆశ పడటం సర్వసాధారణమైపోయింది. ఇందుకు ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీల నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈతరహా ప్రణాళికలను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రక్షణసేన(TRS)పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి పాలమూరు జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో పంచజన్య సంకల్ప సభ నిర్వహించారు. ఈసభలో పెద్ద సంఖ్యలో జనం రావడంతో ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటూ తాను కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతానంటూ మనసులో మాటను బయటపెట్టారు. తన పార్టీపై చూపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూనే తాను సీఎం కావడానికి బలమైన సెంటిమెంట్‌ని గుర్తు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు తర్వాత ముఖ్యమంత్రిగా కాబోయే మూడో వ్యక్తిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. దీనికి కల్వకుంట్ల కవిత చెప్పిన ఓల్డ్ సెంటిమెంట్ ఏమిటో తెలిసి అందరూ పెద్ద స్కెచ్చే వేశావు అక్క అంటున్నారు. ఈనెల 20వ తేది ఆదివారం నాడు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభలో పాల్గొని గతంలో జరిగిన ఓ అపూర్వ కలయికకు సంబంధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు ఆ సెంటిమెంట్‌తోనే తాను కూడా సీఎం అవుతానంటూ నవ్వూతు చెప్పేశారు.
Kavitha Political Strategy
కల్వకుంట్ల కవిత తాను ముఖ్యమంత్రిగా అవడానికి చెప్పిన సెంటిమెంట్ ఏమిటంటే గతంలో అంటే 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పొత్తులో భాగంగా కోస్గి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన ప్రచార సభలో నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి టీడీపీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత ముగ్గురూ ఒకే వేదికను పంచుకున్నారు. ఆనాడు కోస్గి సభ వేదికపై తనతో పాటు పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీకి సీఎం అయ్యారని.. ఆతర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని.. ఆ ఇద్దరూ ప్రస్తుతం ముఖ్యమంత్రులు ఉండగా వారితో పాటు ఆ సభలో పాల్గొన్న తాను కూడా కోస్గి గడ్డకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం మూడో వ్యక్తిగా భవిష్యత్తులో తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల ఆశీస్సులు, తెలంగాణ ప్రజల అదరిస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ చెప్పడం చూసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నవ్వుకుంటున్నారు. నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. మరికొందరైతే ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన వాళ్లు సీఎంలు అయ్యారనే సెంటిమెంట్ కొనసాగించారు. ఆ తర్వాత జైలుకు వెళ్లిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని నమ్మారు. ఇక ఇప్పుడు కోస్గీ కాలేజీ గ్రౌండ్ విజిట్ చేసిన వాళ్లు కూడా సీఎంలు అవుతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కవిత కోస్గీ సెంటిమెంట్ తరహాలోనే .. ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టారు. పాదయాత్ర పేరుతో జనంలో తిరుగుతున్నారు. అయితే ఆయన పాదయాత్రలో నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో ఆయనపై కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
నమ్మకం ఉండటం అతిశయోక్తి లేదు. ఆశ పడటం తప్పు కాదు. కాని కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన వెంటనే ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం, అందుకోసం ఉదహరించే సెంటిమెంట్లను మాత్రం ప్రజలు ఇప్పుడు పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరని కొందరు రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్పష్టం చేస్తున్నారు.














