Karnataka Politics: నేడు కర్ణాటక సీఎల్పీ సమావేశం.. జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం! | | ACTPnews

శివకుమార్, సిద్ధరామయ్య


Last Updated:

శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశం జరగనుంది. ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు.

శివకుమార్, సిద్ధరామయ్య
శివకుమార్, సిద్ధరామయ్య

Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం నూతన ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త సీఎం బాధ్యతలను డీకే శివకుమార్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో విడివిడిగా సమావేశమై ఈ మార్పుపై చర్చించారు. ఈ సందర్భంగా తన కుమారుడికి, అనుచరులకు కొత్త కేబినెట్‌లో డిప్యూటీ సీఎం సహా మంత్రి పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్య విశేషాలు ఇవే

శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశం జరగనుంది. ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. అనంతరం జూన్ 3న ఆయన కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేబినెట్‌లో దాదాపు సగం మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. మూడేళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్లను తొలగించి, వారిని పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేసేలా ‘కామరాజ్ ప్లాన్’ మోడల్‌ను అమలు చేయనున్నారు.

నూతన మంత్రివర్గంలో స్థానం కోసం ఇప్పటికే తీవ్ర పోటీ మొదలైంది. కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఖర్గేను కలిసి తమ జిల్లాకు 3 మంత్రి పదవులు ఇవ్వాలని లేఖ సమర్పించారు.

సిద్ధరామయ్య క్రియాశీల రాజకీయాల నుంచేగాక, కర్ణాటకను వీడి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు నిరాకరించారు. అధిష్ఠానం ప్రతిపాదించిన రాజ్యసభ సీటును తిరస్కరించిన ఆయన, రాష్ట్రంలోనే ఉంటూ 2028 ఎన్నికల వ్యూహకర్తగా కాంగ్రెస్‌ను నడిపించనున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports